Valimai: అజిత్‌ ‘వాలిమై’ ట్రైలర్‌.. క్షణాల్లోనే రికార్డు వ్యూస్‌!

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు అజిత్‌ హీరోగా నటించిన చిత్రం ‘వాలిమై’. హెచ్‌. వినోద్‌ దర్శకుడు. హ్యుమా ఖురేషి కథానాయిక.

Updated : 30 Dec 2021 20:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోలీవుడ్‌ ప్రముఖ నటుడు అజిత్‌ హీరోగా నటించిన చిత్రం ‘వాలిమై’. హెచ్‌.వినోద్‌ దర్శకుడు. హ్యుమా ఖురేషి కథానాయిక. టాలీవుడ్‌ నటుడు కార్తికేయ విలన్‌గా నటించారు. ఈ క్రేజీ ప్రాజెక్టు తమిళ ట్రైలర్‌ గురువారం సాయంత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. విడుదలైన కొన్ని క్షణాల్లోనే లక్షల వీక్షణలు సొంతం చేసుకుని రికార్డు దిశగా దూసుకెళ్తోంది. సుమారు 30 నిమిషాల్లోనే ఈ ట్రైలర్‌ 2 మిలియన్ల (20 లక్షలు) వ్యూస్‌ దక్కించుకుందని సోనీ మ్యూజిక్‌ సంస్థ వెల్లడించింది.

ట్రైలర్‌ విషయానికొస్తే.. బైక్‌ ఛేజింగ్‌, పోరాట సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అజిత్‌, కార్తికేయ.. ఇద్దరి లుక్స్‌, నటన అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. అజిత్‌ అభిమానులు కోరుకునే యాక్షన్‌ హంగామా ఈ సినిమాలో పూర్తిస్థాయిలో ఉన్నట్టు ట్రైలర్‌ ద్వారా తెలుస్తోంది. జీ స్టూడియోస్‌ సంస్థ, బోనీ కపూర్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, ఛాయాగ్రహణం: నీరవ్‌ షా. ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ‘బలం’ పేరుతో తెలుగులో విడుదలకాబోతుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని