Katrina Kaif: ఆ పాటలో ఏడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్న కత్రినా..

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన ‘టైగర్‌-3’ (Tiger 3) చిత్రం నవంబర్‌12న విడుదల కానుంది. తాజాగా ఇందులోని పాటకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని కత్రినా పంచుకున్నారు.

Published : 21 Oct 2023 15:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు యాక్షన్ ప్రియులంతా ఎదురుచూస్తున్న సినిమా ‘టైగర్‌-3’ (Tiger 3). అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan), క్రేజీ కథానాయిక కత్రినా కైఫ్‌ జంటగా నటిస్తున్నారు. నవంబర్‌ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఇప్పుడు పాటతో సందడి చేయడానికి సిద్ధమైంది. దసరా కానుకగా ఇందులోని తొలి పాటను విడుదలచేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా పాట గురించి ఓ ఆసక్తికర అంశాన్ని కత్రినా కైఫ్‌ పంచుకున్నారు.

ఈ పాట తనకెంతో ఇష్టమైనదని చెప్పిన కత్రినా (Katrina Kaif).. దీన్ని టర్కీలాంటి సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరించినట్లు తెలిపారు. ‘ఇందులో నేను ఏడు విభిన్న లుక్స్‌లో కనిపించనున్నా. ప్రతి లుక్‌ గ్లామర్‌గా ఉండడమే కాదు.. దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. ఇక ఈ సినిమాకు పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. సల్మాన్‌, నా నుంచి అభిమానులు ఏదైతే కోరుకుంటున్నారో అది వాళ్లకు ‘లేకే ప్రభు కా నామ్‌’ పాటలో కచ్చితంగా దొరుకుతుంది. ఇక సల్మాన్‌ ఖాన్‌తో డ్యాన్స్‌ చేయడం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. నాకెంతో ఇష్టం. ఈ పాట నాకు ఎప్పటికీ గుర్తిండిపోయే జ్ఞాపకాలను ఇచ్చింది’ అని చెప్పారు. ఇక ఈ పాటలో కత్రినాకు సంబంధించిన 2 ఫొటోలను పంచుకున్న సల్మాన్‌ ఖాన్‌.. ఆమె డ్యాన్స్‌తో అందరినీ అలరించడం ఖాయమని చెప్పారు. ప్రస్తుతం ఆ ఫొటోలు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.

‘లియో’.. రూ.1000 కోట్లు మేము ఆశించడం లేదు: చిత్ర నిర్మాత లలిత్‌కుమార్‌

ఇక ‘టైగర్‌3’ విషయానికొస్తే.. మనీష్‌ శర్మ దర్శకత్వంలో ఇది రూపొందింది. ‘టైగర్‌ జిందా హై’కు సీక్వెల్‌గా రానున్న దీన్ని యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఐదవ సినిమాగా ఆదిత్య చోప్రా నిర్మిసున్నారు. ఇందులో షారుక్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటించారు. సల్మాన్‌-షారుక్‌ల మధ్య భారీ పోరాట ఘట్టాల్ని రూపొందించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు