Vicky Kaushal: ఛావా చిత్రీకరణలో విక్కీ కౌశల్‌కు గాయం

విక్కీ కౌశల్‌ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛావా’. ఈ సినిమా షూటింగ్‌లో విక్కీ కౌశల్‌కు గాయమైంది.

Published : 08 Feb 2024 19:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఉరి: ది సర్జిస్ట్రైక్‌’,‘సామ్‌ బహదూర్‌’(Sam Bahadur) తదితర చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ (Vicky Kaushal). ప్రస్తుతం ఆయన లక్ష్మణ్ ఉటేకర్‌ దర్శకత్వంలో ‘ఛావా’(Chhava)చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని యాక్షన్‌ సీన్స్‌ చేస్తున్నప్పడు విక్కీ కౌశల్‌కు గాయమైందని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని బాలీవుడ్‌ మీడియా సంస్థలు వెల్లడించాయి. విక్కీ కౌశల్‌ ఆర్మ్‌ స్లింగ్‌తో ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘‘మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం విక్కీ భాయ్‌’’ అంటూ ఆయన అభిమానులు ట్వీట్‌ చేస్తున్నారు. ఈ వీడియోని సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. 

ఈ చిత్రంలో రష్మిక కథానాయిక. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కుమారుడు శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. ఇందులో శంభాజీ ధైర్య సాహసాలు,  యుద్ధ సన్నివేశాలు చూపించనున్నారు. విక్కీ ఈ ప్రాజెక్ట్‌ కోసం గుర్రపు స్వారీ, కత్తిసాము నేర్చుకున్నారు. సంజయ్ లీలా బన్సాలీ రూపొందిస్తున్న 'లవ్ అండ్ వార్'లో నటించనున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని