kalki: ‘కల్కి’ విషయంలో స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన నిర్మాణ సంస్థ..

ప్రభాస్- నాగ్‌ అశ్విన్‌ల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) లీకుల విషయంలో నిర్మాణ సంస్థ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేసింది.

Updated : 21 Sep 2023 15:11 IST

హైదరాబాద్‌:  ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). భారీ అంచనాల మధ్య ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు లీకయ్యాయంటూ తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సీరియస్‌గా తీసుకుంది. ‘కల్కి’కు సంబంధించిన ఎలాంటి లీకులు బయటకు వచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ఈ మేరకు ‘కల్కి’ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టింది. ఈ సినిమాకు చెందిన అన్ని హక్కులు నిర్మాణ సంస్థకు మాత్రమే చెందుతాయని చెప్పింది. ఇందులోని ఫొటోలు, వీడియోలు లీక్ చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతే కాదు అనధికారికంగా బయటకు వచ్చిన వాటిని షేర్‌ చేసినా చర్యలు తప్పవని స్పష్టం చేసింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు లీకైనట్లు వార్తలు వచ్చాయి. సదరు సంస్థపై చిత్ర యూనిట్‌ లీగల్‌గా యాక్షన్‌ తీసుకుందని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్‌ చేసిన ట్వీట్‌ ఆసక్తిగా మారింది. 

సాయి పల్లవి పెళ్లిపై మరోసారి రూమర్స్‌.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఇక ‘కల్కి 2898 ఏడీ’ విషయానికొస్తే.. ప్రభాస్‌ సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తోంది. సీనియర్‌ నటుడు కమల్‌హాసన్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అమితాబ్‌ బచ్చన్‌, పశుపతి, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. కామికాన్‌ వేదికగా విడుదల చేసిన ఫస్ట్‌ గ్లింప్స్‌నకు విశేష ఆదరణ లభించింది. హాలీవుడ్‌ స్థాయిలో విజువల్స్‌ ఉన్నాయని అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని