Krishna: కృష్ణ డ్రీమ్‌ ప్రాజెక్టు అందుకే రాలేదు.. అదేంటంటే?

‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత మరో పవర్‌ఫుల్‌ కథలో కృష్ణ నటించాలనుకున్నారు. 

Updated : 15 Nov 2022 17:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా ఎన్నో సాహసాలు చేసిన కృష్ణ (Krishna) తన కలల ప్రాజెక్టును పట్టాలెక్కించలేకపోయారు. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాధారంగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాతో కృష్ణ ఎంతటి సంచలనం సృష్టించారో తెలిసిందే. ఆ తర్వాత ఆయన.. ఛత్రపతి శివాజీ జీవితాధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. స్క్రిప్టు వర్క్‌ కూడా పూర్తయిందట. కానీ, అది పట్టాలెక్కలేదు. పలు కారణాలతో ఈ ప్రాజెక్టును ఆపేశాం’ అని ఓ సందర్భంలో తెలిపారు.

తెలుగు, తమిళ భాషల్లో భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో కృష్ణ ఈ చిత్రాన్ని తీసుకురావాలనుకున్నారు. పూర్తిస్థాయిలో ఛత్రపతి శివాజీగా కనిపించకపోయినప్పటికీ ‘చంద్రహాస్‌’,నంబర్‌-1 అనే సినిమాల్లో చిన్న వేషం వేసి కృష్ణ తన కోరిక నెరవేర్చుకున్నారు. మరోవైపు, మంచి కథ ఉంటే కృష్ణ తన కొడుకు, నటుడు మహేశ్‌బాబు, మనవడు గౌతమ్‌తో కలిసి ఓ చిత్రంలో నటించాలనుకున్నారు. అదీ సాధ్యంకాలేదు. వ్యాఖ్యాతగా వ్యవహరించడం కృష్ణకు బాగా ఇష్టం. హిందీలో విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘కౌన్‌ బనేగా కరోడ్‌ పతి’లాంటి షోను తెలుగులో చేసేందుకు ఆసక్తి చూపారట. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని