Hanuman: ‘హనుమాన్‌’ ఓటీటీ రిలీజ్‌పై మరోసారి స్పందించిన జీ5.. రిప్లై ఇదే

‘హనుమాన్’ ఓటీటీ విడుదలపై జీ5 స్పందించింది.

Published : 08 Mar 2024 14:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘హనుమాన్‌’ (Hanuman) ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఈ సూపర్‌ హిట్‌ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. తొలుత ఇది మార్చి 2 నుంచి ‘జీ5’లో స్ట్రీమింగ్‌ అవుతుందని టాక్ వినిపించింది. ఆ తర్వాత శివరాత్రి సందర్భంగా మార్చి 8న ప్రసారం కానుందని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో నెటిజన్లు జీ5ను ట్యాగ్‌ చేస్తూ ‘హనుమాన్’ ఓటీటీ విడుదలపై సమాచారం చెప్పమని కోరుతున్నారు. తాజాగా  యూజర్లకు సదరు సంస్థ రిప్లై ఇచ్చింది.

రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ తెలుగులో ఎలా ఉంది?

‘‘హనుమాన్‌’ ఓటీటీపై మాకు ఇంకా సమాచారం రాలేదు. అందుకే దీనిపై నిర్ణయం తీసుకోలేదు. మరిన్ని అప్‌డేట్స్‌కు మా సోషల్‌మీడియా ఖాతాలను అనుసరించండి’ అని పేర్కొంది. దీంతో మరోసారి ఈ చిత్రం కోసం ఎదురుచూసే వారికి నిరాశే ఎదురైంది. ఈ సినిమాను రూ.40 కోట్లతో నిర్మించగా ఇప్పటివరకు రూ.330 కోట్లు వసూలు చేసింది. 150 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల చిత్రబృందం ఘనంగా ఈవెంట్‌ను నిర్వహించింది. అందులో దర్శకుడు మాట్లాడుతూ.. మంచి సినిమాపై ప్రేక్షకులు చూపే అభిమానం ఎంతటి కష్టాన్ని అయినా మరిపిస్తుందన్నారు.  ‘హనుమాన్‌’ అద్భుత విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తేజ సజ్జా (Teja sajja) హనుమంతుగా మెప్పించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar), అమృత అయ్యర్‌, సముద్రఖని, వినయ్‌రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను తదితరులు నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని