రోడ్డును దత్తత తీసుకుని శుభ్రం.. టాంపా బే ‘నాట్స్‌’ వినూత్న సేవ

ఫ్లోరిడా టాంపా బేలోని ‘నాట్స్’ విభాగం సభ్యులు శ్రమదానం చేశారు. విద్యార్థులు, స్థానికులతో కలిసి ఓ రోడ్డుకు ఇరువైపులా చెత్తా చెదారం తొలగించి, పరిశుభ్రంగా మార్చారు.

Published : 18 Jan 2024 22:01 IST

ఫ్లోరిడా: అమెరికాలోని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) వినూత్న సేవా కార్యక్రమంతో ముందుకొచ్చింది. ఫ్లోరిడా టాంపా బేలోని ‘నాట్స్’ విభాగం.. సామాజిక బాధ్యత కింద ఇక్కడి ఓ రోడ్డు (SR 581/Bruce B. Downs Boulevard) వెంబడి మూడు కిలోమీటర్ల మేర స్వచ్ఛతా బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలోనే 35 మంది నాట్స్ సభ్యులు, విద్యార్థులు, స్థానికులు శ్రమదానం చేశారు. రోడ్డుకు ఇరువైపులా చెత్తా చెదారం తొలగించి, పరిశుభ్రంగా మార్చారు. ఇందులో భాగమైన విద్యార్థులకు నాట్స్ సేవా ధ్రువపత్రాలను అందించింది. భావితరంలో సేవాభావాన్ని నింపేందుకు డ్రైవ్ చేపట్టి విజయవంతం చేసిన టాంపా బే నాట్స్ విభాగానికి నాట్స్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి అభినందనలు తెలిపారు.

నాట్స్ మాజీ ఛైర్మన్, నాట్స్ సంబరాలు 2025 కన్వీనర్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా.కొత్త శేఖరం, ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, డైరెక్టర్ శ్రీనివాస్ మల్లాది, కార్యనిర్వాహక కమిటీ వైస్ ప్రెసిడెంట్ భాను ధూళిపాళ్ల, ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, సలహా కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరికట్ల, సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కోఆర్డినేటర్ విజయ్ కట్ట, శ్రీనివాస్ అచ్చి, భాస్కర్ సోమంచి, శ్రీనివాస్ బైరెడ్డి, అనిల్ ఆరేమండ, భార్గవ్ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని