వైకాపా యాత్రలో మందుసీసాతో మహిళల చిందులు

వైకాపా సామాజిక సాధికారయాత్రలో మహిళలు మందేసి.. చిందులు వేశారు. ఈ ఘటన శుక్రవారం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది.

Updated : 04 Nov 2023 10:38 IST

పల్నాడు జిల్లా మాచర్లలో ఘటన

ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట: వైకాపా సామాజిక సాధికారయాత్రలో మహిళలు మందేసి.. చిందులు వేశారు. ఈ ఘటన శుక్రవారం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగింది. ఓ పక్క సభ జరుగుతుంటే చివరలో కొందరు మహిళలు మందు సీసాలతో నృత్యాలు చేశారు. మద్యం సీసాలను చేతిలో పట్టుకుని కొంత తాగి, కొంత పారబోస్తూ నృత్యాలు చేశారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎంపీలు నందిగం సురేష్‌, లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు ఏం చేశారో చెప్పడం ముఖ్య ఉద్దేశం.. కానీ చంద్రబాబును విమర్శించడమే ప్రధాన ధ్యేయంగా సభ సాగింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రైవేటు స్కూళ్లకు సెలవులు ప్రకటించి, బస్సులను కార్యకర్తలు, ప్రజలను తరలించడానికి వినియోగించుకున్నారు. సభ ఏర్పాట్లలో భాగంగా మాచర్ల ప్రధానరహదారిపై ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద ఉన్న తెదేపా జెండాను తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని