BRS: ఆదిలాబాద్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ.. అభ్యర్థిత్వంపై కసరత్తు

ఉమ్మడి ఆదిలాబాద్‌ భారాస నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ సమావేశమయ్యారు.

Published : 14 Mar 2024 17:12 IST

హైదరాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ భారాస నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ మంత్రులు వేణుగోపాలాచారి, జోగు రామన్న, ప్రజాప్రతినిధులు, ఇతర నేతలు భేటీ పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అభ్యర్థిత్వంపై నేతలతో చర్చించి ఖరారు చేయనున్నారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో భారాస తరఫున పోటీ చేసి ఓటమి పాలైన నగేష్.. పార్టీని వీడి భాజపాలో చేరారు. అక్కడ ఆయనకు టికెట్ కూడా ప్రకటించారు. ఈ క్రమంలో ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు శాసనసభ ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు. లోక్‌సభకు అవకాశం ఇస్తామని అధినాయకత్వం అప్పుడే హామీ ఇచ్చింది. తనకు అవకాశం రాదనే నగేష్ పార్టీని వీడారు. ఇవాళ సమావేశం అనంతరం ఆదిలాబాద్ భారాస అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని