FIFA: అందుకే అర్జెంటీనా జెర్సీ నం.10 యమా డేంజర్..!
అర్జెంటీనాలో జెర్సీ నంబర్ 10కి ఉన్న ఫాలోయింగే వేరు. మారడోనా, మెస్సీలు ఈ నంబర్ జెర్సీనే ధరిస్తారు. కానీ, వీరి కంటే ముందే ఓ ఆటగాడు నంబర్ 10 జెర్సీతో ఏక వ్యక్తి సైన్యంలా అర్జెంటీనాకు ప్రపంచకప్‌ను అందించిన విషయం తెలుసా..?
ఇంటర్నెట్‌డెస్క్: సాధారణంగా ఫుట్‌బాల్‌లో గోల్ కొట్టడమంటే మ్యచ్‌లో హీరో అయిపోవడమే. అలాంటిది ప్రపంచకప్‌లో రెండేసి గోల్స్ చొప్పున మూడు కీలక మ్యాచ్‌ల్లో కొట్టాలంటే మామూలు ఆటగాళ్ల వల్ల కాదు. ఇలాంటి గోల్స్ 1978 ప్రపంచకప్‌లో కనిపించాయి. అర్జెంటీనా జట్టు స్వదేశంలో నిర్వహించిన ప్రపంచకప్‌ను అలవోకగా గెలుచుకొంది. ఆ జట్టులో జెర్సీ నంబర్ 10 ఆటగాడు మారియో కెంపెస్ విశ్వరూపం చూపాడు. ఆ టోర్నీలో 6 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అవి మొత్తం మూడు మ్యాచ్‌ల్లో చేసిన జంట గోల్స్ కావడం విశేషం. వీటిల్లో కీలకమైన సెకండ్ రౌండ్, ఫైనల్స్ మ్యాచ్‌లు ఉన్నాయి.
అ టోర్నీలో అర్జెంటీనా తొలి రౌండ్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిచింది. దీంతో రెండో రౌండ్‌లో అడుగు పెట్టింది. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో మారియో కెంపెస్ గోల్స్ చేయలేదు. ఇక రెండో రౌండ్ నుంచి అతడి మాయాజాలం మొదలైంది. అప్పట్లో రౌండ్-16దశ వంటివి లేవు. రెండో రౌండ్‌లో పాయింట్లు ఫైనల్స్‌కు చేరడానికి చాలా కీలకం. దీంతో ఈ రౌండ్‌లో అర్జెంటీనా మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలుచుకొని ఒకటి డ్రా చేసుకొని టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ రౌండ్‌లో ఆ జట్టు పోలాండ్, పెరూతో జరిగిన మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ల్లో మొత్తం 8 గోల్స్ చేస్తే.. మారియో వాటిల్లో నాలుగు గోల్స్ చేశాడు. ఇక ఫైనల్స్ నెదర్లాండ్స్‌తో జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచేందుకు అర్జెంటీనా జట్టు ఐదు నిమిషాలు ఆలస్యంగా మైదానంలోకి అడుగుపెట్టింది. అంతేకాదు ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా వారి రిస్ట్ ప్లాస్లర్లపై అభ్యంతరాలను కూడా తెలిపింది. ఇక మ్యాచ్ కూడా పూర్తి ఉద్రిక్త వాతావరణంలో జరిగింది. 38వ నిమిషంలో డచ్ గోల్ కీపర్ జాన్ యంగ్‌బ్లడ్‌ను బోల్తాకొట్టిస్తూ 12 మీటర్ల దూరం నుంచి గోల్ చేశాడు. ఆ తర్వాత కాలం కరుగుతున్నా.. ఇరు పక్షాలకు గోల్ లభించలేదు. మరో 8 నిమిషాల్లో మ్యాచ్ ముగస్తుందనగా డచ్ ఆటగాడు నన్నింగ్ గోల్ చేయడంతో స్కోర్ సమమైంది. దీంతో అదనపు సమయానికి వెళ్లారు. ఈ సమయంలోని 105వ నిమిషంలో మారియో కెంపెస్ మరో గోల్ చేసి జట్టుకు అధిక్యం అందించాడు. దీంతో నెదర్లాండ్స్ (డచ్)జట్టు ఒత్తిడికి గురైంది. మరో 10 నిమిషాల తర్వాత అర్జెంటీనా ఆటగాడు బెర్టోని కూడా గోల్ చేయడంతో నెదర్లాండ్స్ ఇక ఏ దశలోనూ కోలుకోలేదు. ఈ విజయంతో మారియో కెంపెస్ ఛాంపియన్‌గా అవతరించాడు. ప్రపంచకప్‌తో పాటు, గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ అవార్డులను దక్కించుకొన్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత జెర్సీ నంబర్ 10కి కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మారడోన, మెస్సీ వంటి దిగ్గజాలుకు ఈ జెర్సీ నంబర్ దక్కింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Ugadi: ఉగాది జోష్ పెంచిన బాలయ్య.. కొత్త సినిమా పోస్టర్లతో టాలీవుడ్లో సందడి..
-
India News
Aadhaar: ఆధార్.. ఓటర్ ఐడీ అనుసంధానానికి గడువు పెంపు..!
-
Technology News
Legacy Contact: వారసత్వ నంబరు ఎలా?
-
Movies News
Mrunal Thakur: ‘నా కథను అందరితో పంచుకుంటా..’ కన్నీళ్లతో ఉన్న ఫొటో షేర్ చేసిన మృణాల్
-
World News
Earthquake: పాక్, అఫ్గాన్‌లో భూకంపం.. 11 మంది మృతి..!
-
Ts-top-news News
RTC Cargo: తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు.. ఆర్టీసీ కార్గో నిర్వాకం