- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
Asus: ఆసుస్ నుంచి నాలుగు కొత్త ల్యాప్‌టాప్స్.. ధర, ప్రత్యేకతలివే!
ఇంటర్నెట్ డెస్క్: ఆసుస్ కంపెనీ తన 25వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. ఆసుస్ జెన్‌బుక్ 14 ఓఎల్‌ఈడీ, జెన్‌బుక్ 14X ఓఎల్‌ఈడీ స్పేస్ ఎడిషన్, ఆసుస్ వీవో బుక్ ఎస్14/15 ఓఎల్‌ఈడీ, వీవోబుక్ 14/15 సిరీస్ ల్యాప్‌టాప్‌లను ఆవిష్కరించింది. మరి వీటి ప్రత్యేకతలు, ధరెంతో చూద్దాం..
ఆసుస్ జెన్‌బుక్ 14x ఓఎల్‌ఈడీ స్పేస్ ఎడిషన్ (ASUS ZENBOOK 14X OLED SPACE EDITION)
ఈ ల్యాప్‌టాప్‌లో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 14 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో ఇంటెల్ కోర్ ఐ9 హెచ్-సిరీస్ మొబైల్ ప్రాసెసర్ ఉపయోగించారు. 32జీబీ ఎల్‌పీడీడీఆర్5 4800 ఎమ్‌హెర్జ్ ర్యామ్ ఇస్తున్నారు. 6500 ఎంబీ రీడ్ స్పీడ్‌తో 1టీబీ హైస్పీడ్ ఎస్‌ఎస్‌డీతో పనిచేస్తుంది. దీనిలోనూ మల్టీటాస్కింగ్ కోసం ప్రత్యేకంగా ఆసుస్ నెంబర్ ప్యాడ్ 2.0ను ఇచ్చారు. సీపీయూలో డ్యూయల్ ఫ్యాన్ ఐస్‌కూల్ టెక్నాలజీ వాడారు. వేగంగా లాగిన్ అవ్వడానికి ఫాస్ట్ ఫింగర్‌ప్రింట్ లాగిన్ సదుపాయం ఉంది. ఇందులో వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2 కనెక్టివిటీ, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్, స్మార్ట్ ఆంప్లిఫయర్ కూడా ఉన్నాయి. భారత్‌లో దీని ప్రారంభ ధర రూ.1,14,990గా ఉంది. ఆన్‌లైన్ రిటైల్ స్టోర్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చు.
ఆసుస్ జెన్‌బుక్ 14 ఓఎల్‌ఈడీ (ASUS ZENBOOK 14 OLED)
ఆసుస్ జెన్‌బుక్ 14 ల్యాప్‌టాప్‌లో 12 జెనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7-1260పీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 16జీబీ ఎల్‌పీడీడీఆర్5 ర్యామ్, 512జీబీ ఎస్‌ఎస్‌డీతో పనిచేస్తుంది. ఐరీష్ ఎక్స్‌ఈ గ్రాఫిక్ కార్డ్‌ను వాడారు. 90 హెర్జ్ రిఫ్రెష్ రేటుతో 14 అంగుళాల డిస్‌ప్లేను ఇస్తున్నారు. దీనిలోనూ ఆసుస్ నెంబర్ ప్యాడ్ 2.0ను ఇచ్చారు. బాడీ రేషియో 90శాతం వరకు ఉంది. ఇందులో డాల్బీ అట్మాస్ స్పీకర్లు, ప్రైవసీ షెట్టర్‌తో 720పీ వెబ్‌క్యామ్ సదుపాయం ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 75గంటల వరకు వస్తుంది. 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తోంది. భారత్‌లో దీని ప్రారంభ ధర రూ.89,900గా కంపెనీ నిర్ణయించింది.
ఆసుస్ వీవోబుక్ ఎస్14/15 ఓఎల్‌ఈడీ (ASUS VIVOBOOK S14 /15 OLED)
వీవీబుక్ ఎస్ సిరీస్ ల్యాప్‌టాప్ 18.9ఎంఎం మందంతో రెండు ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. రెండింటి బరువులో చిన్న వ్యత్యాసం ఉంది. ఎస్14 బరువు 1.5కేజీలు కాగా.. ఎస్15 బరువు 1.8 కేజీలు ఉంటుంది. రెండింటిలో 70గంటలపాటు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం ఉంది. 90వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. 12జెనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌నే వాడారు. ఐ7-1200హెచ్ కాన్‌ఫిగరేషన్‌తో పనిచేస్తాయి. ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ లాగిన్, 3డీఎన్‌ఆర్ వెబ్‌క్యామ్, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ వీటి ప్రత్యేకతలు. వీవోబుక్ ఎస్ 14 ధర రూ.74,990గా ఉంది.
వీవోబుక్ 14/15 (VIVOBOOK 14/15 (X1402, X1502))
ఈ ల్యాప్‌టాప్‌లో 12 జెనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఐ5-1240పీ కాన్‌ఫిగరేషన్, విండోస్ 11 ఓఎస్‌తో పనిచేస్తుంది. 14/15.6 అంగుళాల స్క్రీన్‌లలో లభ్యమవుతుంది. 19.9ఎంఎం మందంతో 1.5కేజీ/1.7 కేజీ బరువుతో ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 42గంటలపాటు పనిచేసే బ్యాటరీ సామర్థ్యం ఉంది. 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 180 డిగ్రీల ఫ్లెక్సిబిలిటీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, వైఫై 6 కనెక్టివిటీ, నాయిస్ క్యాన్సెలింగ్ టెక్నాలజీ ఇందులో ఉంటాయి. దీని ధరను రూ.42,990గా కంపెనీ నిర్ణయించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
-
World News
Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
-
India News
Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
-
Sports News
Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
-
Technology News
Noise Smartwatch: ఫోన్ కాలింగ్, హెల్త్ సూట్ ఫీచర్లతో నాయిస్ కొత్త స్మార్ట్‌వాచ్
-
Movies News
Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- Rahul Gandhi: మోదీజీ.. సిగ్గుచేటుగా అనిపించడం లేదా..! రాహుల్ ఫైర్
- Trump: ట్రంప్ పర్యటనకు కేంద్రం ఎంత ఖర్చు చేసిందో తెలుసా?
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Arjun kapoor: అర్జున్.. ప్రజల్ని బెదిరించకు..నటనపై దృష్టి పెట్టు: భాజపా మంత్రి సలహా
- Subramanian Swamy: భాజపాలో ఎన్నికల్లేవ్.. అంతా ‘మోదీ’ ఆమోదంతోనే..!
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఎక్స్ఛేంజ్లో విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు
- Punjab: ₹150 కోట్ల స్కాం.. 11వేలకు పైగా యంత్రాలు మాయం!
- Chiranjeevi: మెగా హీరోలను కలవాలనుకుంటున్నారా? మీకిదే అవకాశం!