విలాస ప్రొజెక్టర్స్‌

మంచి నాణ్యతతో కూడిన విలాసవంతమైన, ఖరీదైన ప్రొజెక్టర్‌ కావాలనుకునేవారి కోసం సామ్‌సంగ్‌ ప్రీమియర్‌ రకాలను అందుబాటులోకి తెచ్చింది. పెద్ద, నున్నటి గోడ ఉంటే చాలు. సినిమాలను, వీడియోలను తనివి తీరా ఆస్వాదించొచ్చు. వీటిని గది మధ్యలో...

Updated : 23 Aug 2022 12:05 IST

మంచి నాణ్యతతో కూడిన విలాసవంతమైన, ఖరీదైన ప్రొజెక్టర్‌ కావాలనుకునేవారి కోసం సామ్‌సంగ్‌ ప్రీమియర్‌ రకాలను అందుబాటులోకి తెచ్చింది. పెద్ద, నున్నటి గోడ ఉంటే చాలు. సినిమాలను, వీడియోలను తనివి తీరా ఆస్వాదించొచ్చు. వీటిని గది మధ్యలో పెట్టాల్సిన, సీలింగ్‌కు వేలాడదీయాల్సిన అవసరమూ లేదు. ఆల్‌ ఇన్‌ వన్‌ కాంపాక్ట్‌గా ఉంటాయి. లివింగ్‌ రూమ్‌కు తగినట్టుగా సెట్‌ చేసుకోవచ్చు. అతి తక్కువ దూరం నుంచే దృశ్యాలను ప్రొజెక్ట్‌ చేయగలవు. కాఫీ టేబుల్‌ మీద గానీ గోడకు బెత్తెడు దూరంలో పెట్టుకున్నా గానీ అత్యధిక నాణ్యతతో దృశ్యాలను ప్రొజెక్ట్‌ చేస్తాయి. ఎల్‌ఎస్‌పీ9టీ రకం 130 అంగుళాలు, ఎల్‌ఎస్‌పీ7టీ రకం 120 అంగుళాల సైజు తెర మోడళ్లలో వస్తున్నాయి. ట్రిపుల్‌ లేజర్‌ టెక్నాలజీతో కూడిన ఎల్‌ఎస్‌పీ9టీ ప్రొజెక్టర్‌కు ప్రపంచంలోనే మొదటిసారి హెచ్‌డీఆర్‌10 ప్లస్‌ సర్టిఫికెట్‌ దక్కించుకుంది. గరిష్ఠంగా 2,800 ఏఎన్‌ఎస్‌ఐ ల్యూమెన్స్‌ వెలువరించగల ఇది పగటిపూట సైతం ప్రకాశవంతమైన, స్పష్టమైన దృశ్యాలను తెర మీద పడేలా చేస్తుంది. ఫిల్మ్‌మేకర్‌ మోడ్‌నూ సపోర్టు చేస్తుంది. ఇలాంటి ఫీచర్‌ గల తొలి ప్రొజెక్టర్‌ ఇదే. దీంతో డైరెక్టర్‌ మాదిరిగా సినిమాలను చూడటానికి వీలుంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని