Snapchat: స్నాప్‌ఛాట్‌లో స్థానిక హోటళ్ల వివరాలు

ఫొటో షేరింగ్‌ వేదిక స్నాప్‌ఛాట్‌లో ఇకపై చుట్టుపక్కల ప్రముఖ హోటళ్లనూ గుర్తించొచ్చు. ఇందుకోసం హోటళ్లను సమీక్షించే ద ఇన్‌ఫ్యాచ్యుయేషన్‌ వెబ్‌సైట్‌తో స్నాప్‌ఛాట్‌ చేతులు కలిపింది. దీంతో స్నాప్‌ఛాటర్లు ఈ వెబ్‌సైట్‌ సమీక్షలను ప్లేస్‌ ప్రొఫైల్‌లో

Updated : 10 Aug 2022 11:26 IST

ఫొటో షేరింగ్‌ వేదిక స్నాప్‌ఛాట్‌లో ఇకపై చుట్టుపక్కల ప్రముఖ హోటళ్లనూ గుర్తించొచ్చు. ఇందుకోసం హోటళ్లను సమీక్షించే ద ఇన్‌ఫ్యాచ్యుయేషన్‌ వెబ్‌సైట్‌తో స్నాప్‌ఛాట్‌ చేతులు కలిపింది. దీంతో స్నాప్‌ఛాటర్లు ఈ వెబ్‌సైట్‌ సమీక్షలను ప్లేస్‌ ప్రొఫైల్‌లో చూడటానికి వీలవుతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 50 పట్టణాల్లో అందుబాటులో ఉంటుంది. స్నాప్‌ఛాట్‌ గత సంవత్సరం స్నాప్‌ మ్యాప్‌ మీద లేయర్స్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది స్నాప్‌ఛాటర్లు తమ స్నేహితులకు ఉపయోగపడేవాటిని గుర్తించటానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. దీన్ని మరింత విస్తృతం చేస్తూ స్థానిక హోటళ్లను గుర్తించేలా తీర్చిదిద్దింది. స్నాప్‌ మ్యాప్‌లో పైన కుడివైపు మూలన ఉండే మెనూ ద్వారా ద ఇన్‌ఫ్యాచ్యుయేషన్‌ గుర్తును తాకితే హోటళ్ల సమీక్షలు కనిపిస్తాయి. తమకు ఇష్టమైన హోటళ్లను ఛాట్‌ ద్వారా స్నేహితులతో షేర్‌ చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా వెళ్లటానికి వీలుగా తమ ఫేవరెట్స్‌ ఫీచర్‌లో ఈ హోటళ్లనూ జత చేసుకోవచ్చు. ఇప్పటికే స్నాప్‌ మ్యాప్‌లో ప్రత్యక్ష వినోద కార్యక్రమాలను గుర్తించే సదుపాయమూ ఉంది. ప్రతి నెల 25 కోట్ల మంది స్నాప్‌ మ్యాప్‌ను వాడుతున్నారని స్నాప్‌ఛాట్‌ పేర్కొంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని