పాకెట్లో పట్టే బుల్లి ప్రింటర్‌

ఎంచక్కా జేబులో పెట్టేసుకోవచ్చు. ఇంక్‌ నింపే బాధ లేదు. కరెంట్‌ ఇబ్బందుల్లేకుండా బ్యాటరీతోనే పని చేస్తుంది. పెరిల్‌పేజ్‌ కంపెనీ ...

Updated : 10 Aug 2022 16:44 IST

ఎంచక్కా జేబులో పెట్టేసుకోవచ్చు. ఇంక్‌ నింపే బాధ లేదు. కరెంట్‌ ఇబ్బందుల్లేకుండా బ్యాటరీతోనే పని చేస్తుంది. పెరిల్‌పేజ్‌ కంపెనీ తయారు చేసిన బుల్లి ‘మినీ పాకెట్‌ థర్మల్‌ ప్రింటర్‌’ సంగతులివి. మూడు అంగుళాల చుట్టుకొలత, 1.6 అంగుళాల మందం మాత్రమే ఉంటుంది. బ్లూటూత్‌ ద్వారా ఫోన్‌కి అనుసంధానించి వాడుకోవచ్చు. రీఛార్జబుల్‌ బ్యాటరీతో పని చేస్తుంది. ఎనిమిది రంగుల్లో అందుబాటులో ఉంది. అయితే అన్ని ప్రింటర్లలోలాగా ఏ4, ఏ3 సైజు ప్రింట్లు కావాలంటే కుదరదు. థర్మల్‌ ప్రింటర్‌ పేపర్‌ రోల్స్‌తో మాత్రమే ప్రింట్లు తీసుకోగలం. 57ఎంఎం స్టిక్కర్లు, లేబుళ్లపై మాత్రమే ప్రింట్లు వస్తాయి. 200 డీపీఐ సామర్థ్యంతో ఫొటోల్నీ అచ్చు వేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని