ఐఫోన్‌ అపోహల నిజమెంత?

ఐఫోన్‌కున్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. దీన్ని విమర్శించేవారూ ఎక్కువే. ఐఫోన్‌ మీద దురభిప్రాయాలకూ కొదవలేదు.

Published : 04 Jan 2023 00:22 IST

ఐఫోన్‌కున్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. దీన్ని విమర్శించేవారూ ఎక్కువే. ఐఫోన్‌ మీద దురభిప్రాయాలకూ కొదవలేదు. అలాంటి కొన్ని అపోహల్లో నిజమెంతో చూద్దాం.

* ఒకసారి ఐఫోన్‌ వాడితే తిరిగి వెనక్కి మళ్లలేరని.. ఆండ్రాయిడ్‌, విండోస్‌, బ్లాక్‌బెర్రీ పరికరాలను మళ్లీ  వాడలేరనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిప్రాయం. ఇది పూర్తిగా తప్పు. ఐఫోన్‌ నుంచి తిరిగి ఆండ్రాయిడ్‌ ఫోన్లకు మళ్లినవారు ఎందరో. ఐఫోన్‌ గలవారు కూడా డేటా సంరక్షణ కోసం ఆండ్రాయిడ్‌ ఫోన్లను వాడటమూ చూస్తుంటాం. స్పామ్‌, ఫిషింగ్‌, స్పైవేర్‌, హానికర యాప్స్‌ బారినపడకుండా ఆండ్రాయిడ్‌ కాపాడుతుంది మరి.

* ఐఫోన్‌కు వైరస్‌లు సోకవనేది మరో అపోహ. పోగ్రామ్స్‌ విషయంలో యాపిల్‌ స్టోర్‌ కఠిన వైఖరి అవలబించటం నిజమే. వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేయటం నిజమే. అలాగని అన్ని ఫోన్లూ వైరస్‌ రహితమని అనుకోవటానికి లేదు.

* అతిగా ఛార్జింగ్‌ చేస్తే ఐఫోన్‌ శాశ్వతంగా దెబ్బతింటుందనీ కొందరు భావిస్తుంటారు. ఒక్క ఐఫోన్లే కాదు.. లిథియం అయాన్‌ బ్యాటరీతో కూడిన పరికరాలేవైనా మితిమీరి చార్జింగ్‌ చేస్తే దెబ్బతినొచ్చు. సాధారణంగా స్మార్ట్‌ఫోన్లు పూర్తిగా ఛార్జ్‌ అయ్యాక ‘ట్రికిల్‌ ఛార్జింగ్‌’ మొదలవుతుంది. ఇది ఛార్జింగ్‌ను ఒక శాతం తగ్గిస్తుంది. ఆ మేరకు ఫోన్‌ తిరిగి ఛార్జ్‌ అవుతుంది. అంటే ఐఫోన్‌ను ఓవర్‌ఛార్జ్‌ చేయటం అసాధ్యమనే చెప్పుకోవచ్చు. అందువల్ల రాత్రంతా ఛార్జ్‌ చేసినా బాధపడాల్సిన పనిలేదు.

* అన్నింటికన్నా ఎక్కువ ఆదరణ పొందింది ఐఫోనే అనేది మరో అభిప్రాయం. ప్రపంచ మొబైల్‌ పరికరాల మార్కెట్లలో ఐఓఎస్‌కు తిరుగులేదని యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ వాడేవారికి చెబుతుంటుంది. కానీ డేటా వివరాలు భిన్నమైన కథనే చెబుతున్నాయి. చాలా దేశాల్లో స్మార్ట్‌ఫోన్లకు ఆండ్రాయిడే ప్రధాన భూమిక. ఐఫోన్ల కన్నా ఆండ్రాయిడ్‌ పరికరాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని