గూగుల్ ఫొటోస్ మారింది
ఫొటోల సేవ్, ఎడిటింగ్ కోసం గూగుల్ ఫొటోస్ వాడేవారికి శుభవార్త. అధునాతన ఎడిటింగ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి.
ఫొటోల సేవ్, ఎడిటింగ్ కోసం గూగుల్ ఫొటోస్ వాడేవారికి శుభవార్త. అధునాతన ఎడిటింగ్ టూల్స్ అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లకు, తర్వాత క్రోమ్‌బుక్స్‌కు వర్తించిన ఈ మార్పులు తాజాగా వెబ్ బ్రౌజర్లలో గూగుల్ ఫొటోస్‌కూ విస్తరించాయి. ఇప్పుడు గూగుల్ ఫొటోస్ పలు ట్యాబ్స్‌తో వినూత్నంగా కనిపిస్తోంది. కొత్త విభాగాల్లో అడ్వాన్స్‌డ్ క్రాపింగ్ టూల్, ప్రీసెట్స్ ట్యాబ్ వచ్చి చేరాయి. ప్రీసెట్స్ ట్యాబ్ ఇంతకుముందు డ్రాప్‌డౌన్ మెనూలో ఒదిగిపోయి ఉండేది. దీంతో బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, షాడోస్, హైలైట్స్ వంటి పనులెన్నో చేసుకోవచ్చు. డ్రాగింగ్, రొటేషన్ కంట్రోళ్లు తెర దిగువకు రీసెట్ బటన్ పక్కకు వచ్చాయి. ఫిల్టర్ విభాగం బ్రౌజర్ల అంచుకు మారింది. బ్రౌజర్‌లో గూగుల్ ఫొటోస్ మీద ఫొటోను తాకితే ‘ట్రై ద న్యూ ఎడిటర్’ ఆప్షన్ ప్రత్యక్ష మవుతుంది. దీన్ని వాడుకోవాలంటే ముందుగా photos.google.com లోకి వెళ్లి, గూగుల్ ఖాతాతో లాగిన్ కావాలి. తర్వాత ఫొటోను ఎంచుకొని, కొత్త ఎడిటర్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. దీని ఎడిటర్ టూల్‌లోని సజెషన్స్ ట్యాబ్ ఫొటోలను మెరుగు పరచుకోవటానికి అవసరమైన సూచనలూ చేస్తుంది. అయితే కొన్ని సజెషన్స్ కేవలం గూగుల్ వన్ సబ్‌స్క్రయిబర్లకే అందుబాటులో ఉన్నాయని గుర్తుంచుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Jaishankar: ఐరాస వేదికగా.. కెనడా, పాకిస్థాన్‌లకు జైశంకర్ చురకలు!
-
Nara Lokesh: 29 నుంచి లోకేశ్ పాదయాత్ర తిరిగి ప్రారంభం
-
Demat nominee: డీమ్యాట్ ఖాతాలకు నామినీ గడువు పొడిగింపు
-
Padmanabha reddy: రూ.10వేల కోట్లు ఫ్రీజ్ చేయండి: సీఈసీకి పద్మనాభరెడ్డి లేఖ
-
Harish Rao: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉన్నాం.. ఆందోళన వద్దు: మంత్రి హరీశ్‌రావు