కంటెంట్‌ మాత్రమే ప్రింట్‌

డిజిటల్‌ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్‌లో తరచూ ప్రింట్‌ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం.

Updated : 13 Dec 2023 03:17 IST

డిజిటల్‌ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్‌లో తరచూ ప్రింట్‌ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం. అయితే వెబ్‌ పేజీని ప్రింట్‌ చేసేటప్పుడు బొమ్మలు, గ్రాఫిక్స్‌ అవసరం లేదనిపించొచ్చు. కేవలం కంటెంట్‌ ఉంటే చాలనుకోవచ్చు. మరెలా? క్రోమ్‌ బ్రౌజర్‌ వాడుతుంటే ఇన్‌బిల్ట్‌ సెటింగ్స్‌ సాయం తీసుకోవచ్చు.

  • వెబ్‌ పేజీని ఓపెన్‌ చేసి కంట్రోల్‌, ప్రింట్‌ మీటలను కలిపి నొక్కాలి. అప్పుడు ప్రింట్‌ ఇంటర్ఫేస్‌ కనిపిస్తుంది. 
  • ఇందులో ఆప్షన్స్‌ విభాగంలోకి వెళ్లి, ‘సింప్లీ పేజ్‌’ బాక్సులో టిక్‌ పెట్టుకోవాలి. ఇది డాక్యుమెంటులో ఉన్న ప్రతి గ్రాఫిక్‌నూ తొలగిస్తుంది. కేవలం టెక్స్ట్‌ మాత్రమే మిగులుతుంది.
  • హెడర్స్‌ అండ్‌ ఫుటర్స్‌ ఆప్షన్‌ ద్వారా శీర్షిక, ఉపశీర్షికలను నిర్ణయించుకోవచ్చు. కావాలంటే వీటిని అలాగే ఉంచుకోవచ్చు. వద్దనుకుంటే తొలగించుకోవచ్చు.
  • ఇక ‘బ్యాక్‌గ్రౌండ్‌ గ్రాఫిక్స్‌’ బాక్సు ద్వారా టెక్స్ట్‌ నేపథ్య ఫార్మాట్లను అలాగే ఉంచుకోవచ్చు. కావాలనుకుంటే తొలగించుకోవచ్చు. అనంతరం ప్రింట్‌ తీసుకుంటే సరి. పీడీఎఫ్‌ రూపంలోనూ సేవ్‌ చేసుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని