ఫోన్‌ డిటాక్స్‌

ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్‌ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్‌ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు.

Published : 27 Dec 2023 00:14 IST

ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్‌ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్‌ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు.

ఐఫోన్లలో..

  • సెటింగ్స్‌ ద్వారా స్క్రీన్‌ టైమ్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి. స్క్రీన్‌ టైమ్‌ను ఆన్‌ చేసుకోవాలి.
  • తర్వాతి పేజీలో కంటిన్యూ ఎంచుకొని, దిస్‌ ఈజ్‌ మై ఐఫోన్‌ మీద తాకాలి.
  • డౌన్‌టైమ్‌ గుర్తు మీద నొక్కి, షెడ్యూల్‌ను ఎంచుకొని ఎనేబుల్‌ చేసుకోవాలి. ఇందులో ఎవ్రీడే లేదా కస్టమైజ్‌ డేస్‌ ఆప్షన్లలో ఇష్టమైనది ఎంచుకొని.. స్టార్ట్‌, ఎండ్‌ టైమ్‌లను నిర్ణయించుకోవాలి.

ఆండ్రాయిడ్‌ ఫోన్లలో..

  • ఆండ్రాయిడ్‌ ఫోన్లలో డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ యాప్‌ ఆయా యాప్‌లకు టైమర్లను నిర్ణయించుకోవటానికి సాయం చేస్తుంది.
  • సెటింగ్స్‌ ద్వారా డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ అండ్‌ పేరెంటల్‌ కంట్రోల్స్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి. ఛార్ట్‌లో ఏయే యాప్స్‌ను ఎంతకాలం వాడుతున్నామో కనిపిస్తుంది. పరిమితం చేయాలనుకునే యాప్‌ను ఎంచుకొని, ఇసుక గడియారంలా కనిపించే యాప్‌ టైమర్‌ మీద క్లిక్‌ చేయాలి. ఇందులో సమయాన్ని నిర్ణయించుకొని.. ఓకే లేదా సెట్‌ మీద ట్యాప్‌ చేయాలి. నిర్ణీత సమయం దగ్గర పడినప్పుడు ఒక నిమిషం ఉందనగా యాప్‌ నలుపు, తెలుపు రంగులోకి మారుతుంది. అనంతరం లాక్‌ అవుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని