గూగుల్ మీట్‌లో పిక్చర్ ఇన్ పిక్చర్
ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో వీడియో, ఆన్‌లైన్ సమావేశాలు ఎంత కీలకంగా మారాయో చూస్తున్నదే. ఇందుకోసం చాలామంది గూగుల్ మీట్‌ను వాడుతుంటారు.
ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో వీడియో, ఆన్‌లైన్ సమావేశాలు ఎంత కీలకంగా మారాయో చూస్తున్నదే. ఇందుకోసం చాలామంది గూగుల్ మీట్‌ను వాడుతుంటారు. దీంతో ఆడియో, వీడియో సమావేశాల కోసం ఇతరులను ఆహ్వానించటం.. వాటిల్లో హాజరు కావటం చాలా తేలికైపోయింది. ఇందులో మరో మంచి ఫీచర్ ఉంది. అదే పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్. వేరే పనులు చేసుకుంటూ, కాస్త అటూఇటూ నడుస్తూ సమావేశానికి హాజరు కావటానికిది ఉపయోగపడుతుంది. దీన్ని వాడుకోవాలంటే..
- మీటింగ్ స్క్రీన్ మీద అడుగున ఉండే మూడు చుక్కల ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- మెనూలో పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను ఎంచుకోవాలి.
- అప్పుడు తెర కుడివైపు అడుగున మీటింగ్ ఇంటర్ఫేస్ చిన్న రూపం కనిపిస్తుంది. దీని మీద నొక్కి పట్టుకొని, డ్రాగ్ చేసుకోవాలి. తెర మీద ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. ఇంటర్ఫేస్ అంచుల మీద పట్టుకొని సైజును మార్చుకోవచ్చు.
- దీంతో సమావేశానికి హాజరవుతూనే ఇతర ట్యాబ్స్, విండోస్, యాప్స్‌తో పనులు చేసుకోవచ్చు.
- మీట్ ఇంటర్ఫేస్ కుడి మూల మీద ట్యాప్ చేస్తే ‘బ్యాక్ టు ట్యాబ్’ ఆప్షన్ కనిపిస్తుంది. దీంతో పిక్చర్-ఇన్-పిక్చర్ నుంచి బయటకు వచ్చేయొచ్చు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ayodhya Temple: జనవరి 22న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం!
-
World Cup 2023: వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన బంగ్లాదేశ్.. సీనియర్ ఆటగాడికి దక్కని చోటు
-
TET Results: 27న టెట్ ఫలితాలు.. ఎన్నిగంటలకంటే?
-
PM Modi: అక్టోబర్ 1, 3 తేదీల్లో తెలంగాణలో మోదీ పర్యటన
-
IND vs AUS: షమి, శార్దూల్ ఇంటికి.. ఆసీస్‌తో మూడో వన్డేకు టీమ్ఇండియాలో 13 మందే
-
CM Kcr: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత