Nothing Phone (1): ఐఫోన్‌ కంటే తక్కువ ధరకే ‘నథింగ్ ఫోన్‌ 1’.. ఎంతంటే?

డిజైన్‌, ఫీచర్లతో విడుదలకు ముందే ఎంతో ఆసక్తి రేకెత్తించిన నథింగ్‌ ఫోన్‌ జులై 12న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోన్‌ ధర గురించి ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటో మీరూ చూసేయండి...

Updated : 07 Jul 2022 18:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: డిజైన్‌, ఫీచర్లతో విడుదలకు ముందే ఎంతో ఆసక్తి రేకెత్తించిన నథింగ్‌ ఫోన్‌ జులై 12న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌ ఫీచర్ల గురించిన వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. యాపిల్ ఐఫోన్‌లకు పోటీగా తక్కువ ధరకే ఆండ్రాయిడ్ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు నథింగ్ కంపెనీ ఫౌండర్‌ కాల్‌ పై ముందునుంచి చెబుతున్నారు. తాజాగా ఈ ఫోన్‌ ధర గురించి ఆసక్తికర విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

  • టెక్‌ వర్గాల నుంచి ఉన్న సమాచారం ప్రకారం నథింగ్‌ ఫోన్‌ వన్‌ 8జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్ (స్టాండర్డ్‌)‌, 8 జీబీ/256 జీబీ (మిడిల్‌), 12 జీబీ/256 జీబీ (హైఎండ్‌) వేరియంట్లలో విడుదలకానుందట.
  • వీటిలో స్టాండర్డ్ వేరియంట్ ధర సుమారు ₹ 31,000, మిడిల్‌ వేరియంట్‌ ₹ 32,000, హైఎండ్‌ మోడల్‌ ₹ 36,000గా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం భారత మార్కెట్లో ఐఫోన్ 13 ధర ₹ 71,000గా ఉంది. దీంతో పోలిస్తే నథింగ్ ఫోన్‌ తక్కువ ధరకే లభిస్తున్నట్లు. 
  • ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో విడుదలకు ముందే ఫోన్‌పై ఆసక్తి రేకెత్తించారు. ఈ ఫోన్‌ బ్యాక్‌ ప్యానెల్‌లోని ఎల్‌ఈడీ లైట్లు ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణ. నోటిఫికేషన్లు, అలర్ట్‌ మెసేజ్‌లు, కాల్స్‌ వచ్చినప్పుడు యూజర్‌ సెట్టింగ్స్‌కు అనుగుణంగా వెనుకవైపు లైట్లు వెలుగుతాయి.
  • ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ స్కానర్‌ కూడా ఉంది. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు, ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 
  • 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.55 అంగుళాల ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 778జీ+ ప్రాసెసర్ ఉపయోగించారు.
  • ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ ఓఎస్‌తో పనిచేస్తుంది. 45 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు.
  • హెడ్‌ఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి ₹ 2,000 డిస్కౌంట్‌ ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని