Whatsapp: 18.58 లక్షల భారతీయ ఖాతాలపై వాట్సాప్ నిషేధం..

ప్రముఖ మెసెజింగ్‌ యాప్‌ వాట్సాప్ జనవరిలో 18.58 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించినట్లు ప్రకటించింది.

Updated : 11 May 2022 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసెజింగ్‌ యాప్‌ వాట్సాప్ జనవరిలో 18.58 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు ప్రకటించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. వాట్సాప్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు 495 భారతీయ ఖాతాలపై ఫిర్యాదులు అందాయని.. అందులో 285 అకౌంట్లను రద్దు చేయాలని వినతులు అందినట్లు వాట్సాప్‌ తెలిపింది. వాటిలో 24 ఖాతాలను రద్దు చేసినట్లు పేర్కొంది. వాట్సాప్‌ యాప్‌లో పొందుపరిచిన టూల్స్, ఇతరత్రా వాటితో దురుసుగా వ్యవహరించిన యూజర్ల ఖాతాలను భారత ఐటీ నిబంధనలను అనుసరించి వాటిపై నిషేధం విధించినట్లు వాట్సాప్‌ తెలిపింది.

‘‘2022 జనవరి 1-31వ తేదీ వరకు యూజర్ల నుంచి వాట్సాప్‌ రిపోర్ట్‌ ఫీచర్‌ ద్వారా ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు ఐటీ నిబంధనలు, 2022 ప్రకారం 18.58 లక్షల ఖాతాలపై చర్యలు తీసుకుంటున్నాం’’ అని వాట్సాప్‌ ఓ నివేదికలో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని