పెద్దగుట్టను సందర్శించిన పర్యావరణవేత్తలు, పౌరహక్కుల నేతలు

వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని కొలన్‌పల్లి, ఆరెగూడెం, కేశవాపూర్‌, జయరాంతండా గ్రామాల పరిధిలోని పెద్దగుట్టను పర్యావరణవేత్త డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌, సామాజిక కార్యకర్త శశిధర్‌రెడ్డి, పర్యావరణ పరిరక్షణ సమితి ప్రతినిధి రవిచందర్‌ మంగళవారం సందర్శించారు.

Published : 07 Jun 2023 04:38 IST

రాయపర్తి, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని కొలన్‌పల్లి, ఆరెగూడెం, కేశవాపూర్‌, జయరాంతండా గ్రామాల పరిధిలోని పెద్దగుట్టను పర్యావరణవేత్త డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌, సామాజిక కార్యకర్త శశిధర్‌రెడ్డి, పర్యావరణ పరిరక్షణ సమితి ప్రతినిధి రవిచందర్‌ మంగళవారం సందర్శించారు. 132 సర్వే నంబరులో సుమారు 137 ఎకరాల్లో పెద్దగుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్టపై 5 హెక్టార్లలో కలర్‌ గ్రానైట్ తవ్వకాలకు 2019లో ప్రభుత్వం అనుమతులిచ్చింది. నాటి నుంచి గ్రానైట్‌ తవ్వకాలను ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో తవ్వకాలను నిలిపివేసినా.. ఇటీవల తిరిగి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పెద్దగుట్టను పర్యావరణవేత్తలు, పౌరహక్కుల సంఘం నేతలు సందర్శించారు. గుట్టపై అరుదైన పాలీరైట్ గ్రానైట్, ఔషధ మొక్కలు ఉన్నట్లు గుర్తించామని వారు తెలిపారు. మైనింగ్‌ తవ్వకాలతో సమీప గ్రామాల్లో జీవజాతులు అంతరించిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో ఉండగా అక్రమంగా తవ్వకాలు చేపట్టడం సరికాదన్నారు. గుట్టపై మైనింగ్‌ అనుమతులు రద్దయ్యే వరకు సమష్టిగా పోరాడాలని నాలుగు గ్రామాల ప్రజలను వారు కోరారు. కార్యక్రమంలో పర్యావరణ సమితి సభ్యులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని