‘తెలంగాణ ప్రగతి’ నివేదన పుస్తకావిష్కరణ

రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో అన్ని రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని నివేదిస్తూ ఫొటోలు, సమాచారంతో  ప్రభుత్వం ‘తెలంగాణ ప్రగతి (మెర్క్యురియల్‌ రైజ్‌ ఆఫ్‌ తెలంగాణ)’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు.

Published : 20 Jun 2023 03:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో అన్ని రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని నివేదిస్తూ ఫొటోలు, సమాచారంతో  ప్రభుత్వం ‘తెలంగాణ ప్రగతి (మెర్క్యురియల్‌ రైజ్‌ ఆఫ్‌ తెలంగాణ)’ పేరిట రూపొందించిన పుస్తకాన్ని సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్‌ సూచనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి నేతృత్వంలో ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. తొలి కాపీలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సీఎస్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్‌కుమార్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌ అశోక్‌రెడ్డి, ఐఏఎస్‌ అధికారులు ముషారఫ్‌, హరిచందన తదితరులు పాల్గొన్నారు.

కొల్లూరులో 15,660 రెండు పడక గదుల  ఇళ్లు సిద్ధం.. 22న ప్రారంభించనున్న సీఎం

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 22న సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు రానున్నారు. అక్కడ రూ.184.87 కోట్ల వ్యయంతో నాలుగు ఎకరాల్లో నిర్మించనున్న 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మూడంతస్తుల్లో 11 విభాగాలు, 10 రకాల వార్డులు, ఐదు రకాల ల్యాబ్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ రమణకుమార్‌, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కలిసి సోమవారం ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరోవైపు కొల్లూరులో 124 ఎకరాల్లో రూ.117.45 కోట్లతో జీ+9, జీ+10, జీ+11 అంతస్తుల చొప్పున 117 బ్లాకులుగా నిర్మించిన 15,660 రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఆరుగురికి కేటాయింపు లేఖలు అందజేస్తారు. ఇందుకుగాను 98వ నంబరు బ్లాకును ప్రారంభానికి సిద్ధం చేశారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, ఓఎస్డీలు మహేందర్‌, సురేశ్‌బాబు, జలమండలి ఈడీ సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని