తెలుగు వర్సిటీ 2021 సాహితీ పురస్కారాలు

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021 సంవత్సరానికి గాను వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు ప్రకటించింది.

Published : 14 Oct 2023 04:57 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2021 సంవత్సరానికి గాను వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు ప్రకటించింది. పద్య కవితా ప్రక్రియలో డా.మాడుగుల అనిల్‌కుమార్‌(శ్రీగిరిజా కల్యాణం), వచన కవిత్వంలో తండా హరీశ్‌గౌడ్‌(ఇన్‌బాక్స్‌), బాలసాహిత్యంలో మాచిరాజు కామేశ్వరరావు(పాపిష్టి డబ్బు), కథానికలో అల్లాడి శ్రీనివాస్‌(ఎడారిపూలు), నవలలో అట్టాడ అప్పలనాయుడు(బహుళ), సాహిత్య విమర్శలో కె.పి.అశోక్‌కుమార్‌(తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం), నాటకంలో ఎస్‌.డి.వి.అజీజ్‌(తుర్రెబాజ్‌ఖాన్‌), అనువాద సాహిత్యంలో స్వర్ణ కిలారి(లిప్తకాలపు స్వప్నం), వచన రచనలో కోడం పవన్‌కుమార్‌(కరోనాజీలాక్‌డౌన్‌.360), రచయిత్రి ఉత్తమ గ్రంథం విభాగంలో విజయ బండారు(గణిక) ఎంపికయ్యారని వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. త్వరలో వర్సిటీలో జరిగే ప్రత్యేక వేడుకలో వీటిని ప్రదానం చేస్తామని, ఒక్కో పురస్కారం కింద రూ.20,116 నగదుతో సత్కరిస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని