23 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాల ప్రదానం

తెలుగు సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన 23 మందికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 సంవత్సరానికిగాను గురువారం కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది.

Published : 22 Mar 2024 04:30 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన 23 మందికి పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 సంవత్సరానికిగాను గురువారం కీర్తి పురస్కారాలను ప్రదానం చేసింది. వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్‌రావు అధ్యక్షతన జరిగిన వేడుకకు రాష్ట్ర జ్యుడిషియల్‌ అకాడమీ డైరెక్టర్‌, సాహితీవేత్త డా.మంగారి రాజేందర్‌(జింబో) ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వర్సిటీ జానపద కళల శాఖాధిపతి డా.లింగయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల డప్పు వాయిద్య ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌, విస్తరణ సేవా విభాగం సహాయ సంచాలకుడు రింగు రామ్మూర్తి పాల్గొన్నారు.

విభాగాల వారీగా అందుకున్న వారు..

ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు(సాహిత్య విమర్శ), కొల్లాపురం విమల(మహిళాభ్యుదయం), కొడాలి వెంకటేశ్వరరావు(లలిత సంగీతం), ప్రసన్నకుమారి(శాస్త్రీయ సంగీతం), ఎస్‌.కె.బాబుజీ(జానపద కళలు), రంగరాజు పద్మజ(ఉత్తమ రచయిత్రి), నామని సుజాతాదేవి(ఉత్తమ రచయిత్రి), డా.కె.శ్రీదేవి(నవల), లలితారాజ్‌(ఉత్తమ నటి), మోహన్‌ సేనాపతి(ఉత్తమ నటుడు), గరికపాటి కాళీదాస్‌(నాటకరంగం), డా.ఆర్‌.ఎల్‌.వి.రమేశ్‌(ఆంధ్రనాట్యం), డా.ఎస్‌.పి.భారతి(కూచిపూడి), జీవీఎన్‌ రాజు(వ్యక్తిత్వ వికాసం), షరీఫ్‌ గోరా(హేతువాద ప్రచారం), డా.చేగోని రవికుమార్‌(గ్రంథాలయ సమాచార విజ్ఞానం), అనుముల శ్రీనివాస్‌ (గ్రంథాలయకర్త), మాదిశెట్టి గోపాల్‌(సాంస్కృతిక సంస్థ నిర్వహణ), బి.వి.సత్యనగేశ్‌(ఇంద్రజాలం), మృత్యుంజయ(కార్టూనిస్టు), డా.నూనె వెంకటయ్య(జ్యోతిషం), సి.రామనాథశర్మ(ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు), గౌరి వేముల(చిత్రలేఖనం).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని