నామినేషన్ల తిరస్కరణపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ

పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి సంబంధించి దాఖలైన నామినేషన్ల తిరస్కరణపై జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.

Published : 01 May 2024 02:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీకి సంబంధించి దాఖలైన నామినేషన్ల తిరస్కరణపై జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. నామినేషన్లను తిరస్కరిస్తూ ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్లను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ నల్గొండ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వీరబ్రహ్మ రవి, మెదక్‌ స్థానం నుంచి కల్లు నర్సింలుగౌడ్‌, మల్కాజిగిరి నుంచి షేక్‌ తౌఫీక్‌లు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  ఈ పిటిషన్లపై ‘ఎన్నికల ప్రక్రియ మొదలైనందున జోక్యం చేసుకోలేమంటూ’ ఇదే హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత పిటిషన్లలోనూ జోక్యం చేసుకోలేమంటూ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యంతరాలు ఏవైనా ఉంటే ఫలితాలు వెలువడిన తర్వాత ఎన్నికను సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసుకోవచ్చంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని