చెక్క ఫ్రిజ్‌లు వస్తున్నాయి!

అపార్ట్‌మెంట్లలో... కాంక్రిట్‌ జంగిల్‌లాంటి వాతావరణంలో జీవిస్తుంటే మనసుకు ఏదో ఉక్కబోతలా అనిపిస్తుంది. ప్రకృతి మధ్యలో హాయిగా జీవించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ అందరికీ అది సాధ్యం కాదుగా. అందుకే ఈ మధ్యకాలంలో ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందిన ఫర్నిచర్‌ మార్కెట్లోకి వస్తోంది.

Published : 29 Apr 2024 02:15 IST

స్వీట్‌ హోమ్‌

అపార్ట్‌మెంట్లలో... కాంక్రిట్‌ జంగిల్‌లాంటి వాతావరణంలో జీవిస్తుంటే మనసుకు ఏదో ఉక్కబోతలా అనిపిస్తుంది. ప్రకృతి మధ్యలో హాయిగా జీవించాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ అందరికీ అది సాధ్యం కాదుగా. అందుకే ఈ మధ్యకాలంలో ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందిన ఫర్నిచర్‌ మార్కెట్లోకి వస్తోంది. స్టెయిన్‌లెస్‌స్టీల్‌, ప్లాస్టిక్‌ ఫర్నిచర్‌పైన చెక్కను పోలిన షీల్డ్‌ వేయడం వల్ల ఇంటి అందాన్ని పెంచడంతో పాటు ప్రకృతిలో ఉన్న అనుభూతి కల్పించాలన్నది తయారీదారుల ఆలోచన. అందుకే... వాల్‌నట్‌, ఓక్‌, టేక్‌, మహాగని చెక్కను పోలిన కవర్లతో రిఫ్రిజిరేటర్లూ, ఏసీ బాక్స్‌లు తయారుచేస్తున్నారు. మరికొందరైతే ఏకంగా చెక్క బీరువాల్లోనే బిల్ట్‌ ఇన్‌ తరహా ఫ్రిజ్‌లు ఏర్పాటు చేసుకుని ఆనందపడుతున్నారు. అయితే తాజాగా గోద్రెజ్‌ సంస్థ నానోటెక్నాలజీ వాడి అచ్చంగా చెక్కను పోలిన ఫ్రిజ్‌లు తయారుచేస్తోంది. ఇంటి ఫర్నిచర్‌లో కలిసిపోయి చూపరుల్ని భలేగా ఆకట్టుకుంటున్నాయివి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్