China: మరోసారి తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు

తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్ అమెరికాలో పర్యటించారనే వార్తల నేపథ్యంలో చైనా ఆ దేశం చుట్టూ సైనిక కవాతు చేపట్టింది. తైవాన్ వేర్పాటువాదులు విదేశీ శక్తులకు ఇది గట్టి హెచ్చరిక అని ఆ దేశ రక్షణశాఖ పేర్కొంది. దక్షిణ అమెరికాలోని పరాగ్వేలో పర్యటించిన తైవాన్ ఉపాధ్యక్షుడు మార్గ మధ్యలో శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్‌లను సందర్శించారు. తైవాన్‌ను తమ దేశంలో అంతర్భాగంగా చూస్తున్న చైనాకు ఆ దేశ ఉపాధ్యక్షుడు అమెరికా పర్యటన మింగుడు పడటం లేదు. ఈ క్రమంలోనే ద్వీప దేశం చుట్టూ యుద్ధ విమానాలు, నౌకలతో విన్యాసాలు చేపట్టింది. 

Updated : 19 Aug 2023 17:03 IST

Tags :

మరిన్ని