AP News: వైకాపాతో అంటకాగుతున్న ఐపీఎస్‌లపై ఈసీ వేటు

అధికార వైకాపాతో అంటకాగుతూ గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.

Published : 24 Apr 2024 09:25 IST

అధికార వైకాపాతో (YSRCP) అంటకాగుతూ గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. నిఘా విభాగాధిపతి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా.. ఎన్నికల షెడ్యూలు వచ్చాక కూడా వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి వారిద్దరిపై చర్యలు తీసుకుంది.

Tags :

మరిన్ని