India-Maldives: మాల్టీవులకు తప్పు తెలిసొచ్చిందా?

  తిప్పికొడితే 6 లక్షల జనాభా కూడా ఉండదు. విస్తీర్ణంలో దిల్లీ కంటే 5 రెట్లు చిన్న. ఆర్థిక వ్యవస్థకు ఆధారం కేవలం పర్యాటకం. అనేక విషయాల్లో భారత్ నుంచి సాయం. ఇదీ మన పక్కన ఉన్న ద్వీప దేశం మాల్దీవులు కథ. అలాంటి దేశం గతవారం లక్షద్వీప్ లో ప్రధాని నరేంద్ర మోదీ జరిపిన పర్యటనపై నోరుపారేసుకుంది. భారత్ ఆగ్రహానికి కారణమైంది. మాల్దీవులుకు భారత పర్యాటకులు వెళ్లొద్దని, లక్షద్వీప్ కు వెళ్లాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. తాజా పరిణామాలతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లాలనుకునే వారు తమ పర్యటనలను రద్దు చేసుకుంటూ ఉండడంతో ఆ దేశ ఆర్థిక రంగం కూడా ప్రమాదంలో పడింది. భారత్ తో వివాదం నేపథ్యంలో ముగ్గురు మంత్రులు పదవులు కోల్పోగా, ఆ దేశ అధ్యక్షుడి పీఠం సైతం కదులుతోంది. మరి మాల్దీవుల నేతలు కొరివితో ఎందుకు తల గోక్కున్నారు. వారి నోటి దురదకు కారణం ఏమిటి. దీని వెనక చైనా కుట్రలు ఏమైనా దాగున్నాయా.

Updated : 11 Jan 2024 15:04 IST

Tags :

మరిన్ని