Pulivendula: సీఎం జగన్‌ కుటుంబ సభ్యుల వివరాల్లోనూ తప్పులే!

ఓటర్ల తుది జాబితాలో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. సాక్షాత్తు సీఎం జగన్‌ కుటుంబ సభ్యుల పేర్లలోనూ తప్పులే కనిపిస్తున్నాయి.

Updated : 15 Feb 2024 08:41 IST

పులివెందుల, న్యూస్‌టుడే: ఓటర్ల తుది జాబితాలో తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. సాక్షాత్తు సీఎం జగన్‌ కుటుంబ సభ్యుల పేర్లలోనూ తప్పులే కనిపిస్తున్నాయి. వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని 138వ పోలింగ్‌ కేంద్రం పరిధిలో సీఎం, వారి కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయి. సీఎం జగన్‌ పెద్దమ్మ పేరు వైఎస్‌ భారతమ్మ కాగా ఓటరు జాబితాలో వైఎస్‌ భారతిరెడ్డి అని ముద్రించారు. ఆమె భర్త పేరు వైఎస్‌ జార్జిరెడ్డి అయితే.. రెడ్డిగా నమోదు కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని