రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు

మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది.

Updated : 19 Mar 2024 06:37 IST

 మూగ, చెవుడు ఉండటంతో మౌనరోదన

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. తల్లిదండ్రులను, ఆసుపత్రి సిబ్బందిని ఆందోళనకు గురిచేసిన ఈ ఘటన బాలుడు సురక్షితంగా ఉండటంతో సుఖాంతమయ్యింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లెకు చెందిన ఉస్సేనయ్య, మౌనికల కుమారుడు సుజిత్‌ (5)కు పుట్టుకతో మూగ, చెవుడు. ఈ నేపథ్యంలో శస్త్రచికిత్స నిమిత్తం 20 రోజుల కిందట ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం తల్లి బయటకు వెళ్లిన సమయంలో బాలుడు వార్డు పక్కనే ఉన్న ఎనస్థీషియా విభాగాధిపతి గదిలోకి వెళ్లిపోయాడు. సిబ్బంది అదే సమయంలో ఆ గదిని శుభ్రం చేసి చిన్నారిని గమనించకుండా తాళం వేసుకుని వెళ్లిపోయారు. కుమారుడు కనపడకపోవడంతో సిబ్బందికి తల్లి సమాచారం ఇచ్చారు. వారు ఎంత ప్రయత్నించినా బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఆ వైద్యుడి గది తలుపులు తెరవగా సుజిత్‌ కనపడటంతో సిబ్బంది అవాక్కయ్యారు. తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. పిల్లాడు ఆ గది ఫ్రిజ్‌లో ఉన్న నీటిని తాగి ప్రాణాలు కాపాడుకున్నాడని సిబ్బంది తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని