Royal Enfield Himalayan: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కొత్త హిమాలయన్‌.. ధర, ఫీచర్లు ఇవిగో!

Royal Enfield Himalayan launched: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ కొత్త హిమాలయన్‌ను లాంచ్‌ చేసింది. మూడు వేరియంట్లలో దీన్ని తీసుకొచ్చింది. బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.

Updated : 25 Nov 2023 14:19 IST

Royal Enfield Himalayan | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మోటార్‌ సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్‌ తన అడ్వెంచర్‌ మోటార్‌ సైకిల్‌ కొత్త హిమాలయన్‌ను (Royal Enfield Himalayan) లాంచ్‌ చేసింది. గోవాలో జరిగిన మోటోవెర్స్‌ ఈవెంట్‌లో దీన్ని తీసుకొచ్చింది. దీని ధర రూ.2.69 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. ఇది లాంచింగ్‌ ఆఫర్‌ మాత్రమే. డిసెంబర్‌ 31 తర్వాత ధరలు పెంచుతామని కంపెనీ పేర్కొంది. కొత్త హిమాలయన్‌ మూడు వేరియంట్లలో వస్తోంది.

బేస్‌ వేరియంట్‌ను మౌంటెయిన్‌ పేరుతో పిలుస్తున్నారు. ఇది కాజా బ్రౌన్‌ రంగులో లభిస్తుంది. మిడ్‌ వేరియంట్‌ను పాస్‌గా పిలుస్తారు. ఇది స్లేట్‌ హిమాలయన్‌ సాల్ట్‌, స్లేట్‌ హిమాలయన్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.2.74 లక్షలుగా కంపెనీ పేర్కొంది. ఇక టాప్‌ వేరియంట్‌ను పీక్‌గా వ్యవహరిస్తున్నారు. ఇందులో క్యామెంట్‌ వైట్‌ ధర రూ.2.79, హన్లే బ్లాక్‌ రూ.2.84 లక్షలుగా కంపెనీ పేర్కొంది.

ఇక ఇంజిన్‌ విషయానికొస్తే.. కొత్త హిమాలయన్‌ 451 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 40.02 బీహెచ్‌పీ పవర్‌ను, 40ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ ఉంది. ముందువైపు 21 అంగుళాల వీల్‌, వెనుక వైపు 17 అంగుళాల స్పోక్‌ వీల్స్‌తో వస్తోంది. ముందువైపు 320 ఎంఎం డిస్క్‌ బ్రేక్‌, వెనుక వైపు 270 ఎంఎం డిస్క్‌ అమర్చారు. డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌ అమర్చారు.

ఇందులో అడ్జస్టబుల్‌ సీట్‌ ఉంది. ఎత్తు కావాల్సిన విధంగా 825 ఎంఎం నుంచి 845ఎంఎం వరకు పెంచుకోవచ్చు. లోయర్‌ సీటును 805-825 ఎంఎం వరకు అడ్జెస్ట్‌ చేసుకోవచ్చు. 17 లీటర్ల సామర్థ్యం కలిగిన మెటాలిక్‌ ట్యాంక్‌ను అమర్చారు. ఈ మోటార్‌ సైకిల్ బరువు 198 కేజీలు. కొత్త హిమాలయన్‌లో టీఎఫ్‌టీ డ్యాష్‌ బోర్డును స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకోవచ్చు. గూగుల్‌తో కలిసి నావిగేషన్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో ఎకో, పెర్ఫార్మెన్స్‌, రియర్‌ ఏబీఎస్‌ ఆన్‌, పెర్ఫార్మెన్స్‌ విత్‌ రేర్‌ బీఎస్‌ ఆఫ్‌ వంటి రైడింగ్‌ మోడ్స్‌ ఉన్నాయి. బైక్‌ మొత్తం ఎల్‌ఈడీ లైటింగ్‌తో వస్తోంది. ఈ మోటార్‌ సైకిల్‌ టాప్‌ స్పీడ్‌ 150 కిలోమీటర్లు. లీటర్‌కు 28 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుంది. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని