Health Insurance: ఆదిత్య బిర్లా 4-in-1 హెల్త్ ప్లాన్‌!

ఇండ‌స్ట్రీ ప‌స్ట్ 4-ఇన్-1 హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌గా సంస్థ పేర్కొంది

Updated : 21 Sep 2022 16:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆదిత్య బిర్లా క్యాపిట‌ల్ లిమిటెడ్ (ABCL) అనుబంధ సంస్థ అయిన ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ కో. లిమిటెడ్ (ABHICL) యాక్టివ్ హెల్త్+మ‌ల్టీ ఫిట్ కాంబోతో ఆరోగ్య బీమా ప్లాన్‌ను లాంచ్ చేసింది. రెగ్యులేట‌రీ సాండ్‌బాక్స్ కింద ఈ కొత్త ప్రొడక్ట్‌ను ప్రారంభించిన‌ట్లు సంస్థ వెల్ల‌డించింది. ABHICL అందిస్తున్న ఈ కొత్త యాక్టివ్ హెల్త్+మ‌ల్టీ ఫిట్ కాంబోతో క‌స్ట‌మ‌ర్లు త‌మ దైనందిన జీవితంలో 'వెల్‌నెస్ సొల్యూషన్స్‌'తో పాటు ఆరోగ్య బీమా కవర్, ఫిట్‌నెస్ ప్రయోజనాలను పొందే వీలు క‌ల్పిస్తుందని, డిజిట‌ల్ సేవ‌లు అందుబాటులో ఉండ‌డం వ‌ల్ల ఆరోగ్యక‌ర‌మైన అల‌వాట్ల‌ను పెంపొందించుకుని, 'హెల్త్ -ఫ‌స్ట్ లైఫ్‌' (ఆరోగ్యమే ప్రధానం)తో జీవించే విధంగా వినియోగ‌దారుల‌ను ప్రోత్స‌హిస్తూ రివార్డుల‌ను అందిస్తున్న‌ట్లు సంస్థ తెలిపింది. 

కొత్త స‌మ‌గ్ర బీమా పాల‌సీ ప్ర‌యోజ‌నాలు..

పాలసీ ఫీచర్లు: ఈ పాల‌సీ ఆసుప‌త్రి ఖ‌ర్చులు, ఆధునిక చికిత్స‌లు, దీర్ఘకాలిక వ్యాధులను కవర్ చేస్తుంది. అదే విధంగా నో- క్లెయిమ్ బోనస్ ప్ర‌యోజ‌నాన్ని అందిస్తుంది. డే-కేర్ విధానాలు, ఆసుప్ర‌తిలో చేర‌క ముందు, చేరిన త‌ర్వాత ఖ‌ర్చుల‌ను క‌వ‌ర్ చేయ‌డంతో పాటు న‌గ‌దు ర‌హిత గృహ చికిత్స‌ల‌ను అందిస్తుంది. 10,000కి పైగా నెట్‌వర్క్ ఆసుపత్రులలో అన్ని ప్రయోజనాలను పొంద‌వ‌చ్చ‌ని సంస్థ తెలిపింది.

ఆరోగ్య, సంర‌క్ష‌ణ ప్ర‌యోజ‌నాలు: ఈ పాల‌సీ.. వినియోగ‌దారుల‌కు 100 శాతం హెల్త్ రిట‌ర్నుల‌ను అందిస్తుంది. ఆరోగ్యప‌రంగా ఫిట్‌గా ఉండేదుకు 'యాక్టివ్‌ డేజ్‌'ని పూర్తి చేసిన వారికి ఈ రిట‌ర్నులు ల‌భిస్తాయి. పాల‌సీ పున‌రుద్ధ‌ర‌ణ‌పై  ప్రీమియం చెల్లించేందుకు ఈ రిట‌ర్నుల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు. వెల్‌నెస్ ప్రతిపాదనలో భాగంగా, పాలసీ వార్షిక ఆరోగ్య చెక‌ప్‌లు, కాల్‌పై కౌన్సెలింగ్‌తో పాటు డైటీషియన్ సపోర్ట్‌ను కూడా కవర్ చేస్తుంది. వార్షిక ఆరోగ్య చెక‌ప్‌లు  మొద‌టి రోజు నుంచి అందుబాటులో ఉంటాయి. 

ఫిట్‌నెస్ ప్ర‌యోజ‌నాలు: పాల‌సీదారుల ఫిట్‌నెస్ కోసం లైవ్ వర్కౌట్‌లు, జిమ్ సెషన్‌లు, యాప్‌లో అందుబాటులో ఉంటాయి. వీటిని యాక్సెస్ చేయ‌డం ద్వారా 'యాక్టీవ్‌ డేజ్‌’ను పొంద‌వ‌చ్చు. 

రివార్డ్స్‌: వేర్వేరు లైఫ్‌స్టైల్‌, ట్రావెల్‌, ఎంట‌ర్‌టైన్‌మెంట్ భాగ‌స్వాముల‌తో క‌లిసి క్యాష్‌బ్యాక్‌, డిస్కౌంట్ల‌ను ఈ ప్రొడెక్ట్‌ ఆఫ‌ర్ చేస్తోంది. పాల‌సీదారులు వ్య‌క్తిగ‌తంగా గానీ, కుటుంబంతో క‌లిసి ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీగా గానీ కొనుగోలు చేయ‌వ‌చ్చు. వ్య‌క్తిగ‌త పాల‌సీదారుల క‌నీస వ‌య‌సు 5 సంవ‌త్స‌రాలు. ఫ్యామిలీ ఫ్లోట‌ర్ పాల‌సీలో ఆధారిత‌ పిల్ల‌ల క‌నీస వ‌య‌సు 91 రోజులు, పెద్ద‌ల క‌నీస వ‌య‌సు 18 సంవ‌త్స‌రాలు ఉండాలి. గ‌రిష్ఠ ప‌రిమితి లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని