భారత్‌లో అమెజాన్‌ ఇంటర్నెట్‌ సేవలు.. అనుమతుల కోసం దరఖాస్తు!

Amazon Satellite Internet Services: భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీసులు ప్రారంభించేందుకు టెక్‌ దిగ్గజం అమెజాన్‌ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం ప్రభుత్వ అనుమతులకు దరఖాస్తు చేసుకుంది.

Published : 12 Oct 2023 14:01 IST

Amazon Satellite Internet Services | ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌లో శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు ప్రారంభించేందుకు ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ (Amazon) సిద్ధమవుతోంది. ‘ప్రాజెక్ట్‌ కైపర్‌’ పేరిట అమెజాన్‌ శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ సర్వీసులను (Satellite Internet Service) అందించనుంది. ఇందుకోసం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అమెజాన్‌కు చెందిన కైపర్‌ వ్యవస్థలో భాగంగా భూ సమీప కక్ష్యలో ఉన్న 3,236 ఉపగ్రహాల నెట్‌వర్క్ సాయంతో ఈ ఇంటర్నెట్‌ సేవలు అందించనున్నారు. వీటి ద్వారా తక్కువ లేటెన్సీతో కూడిన ఇంటర్నెట్‌ సేవలను గ్రామీణ ప్రాంతాల్లో సైతం అందించేందుకు వీలు పడుతుంది. భారత్‌లో ఈ సర్వీసులను ప్రారంభించేందుకు నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ అథరైజేషన్‌ సెంటర్‌కు అమెజాన్‌ దరఖాస్తు చేసుకుంది. దీనికి టెలికాం విభాగం నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంది.

పండగ సేల్‌లో నో-కాస్ట్‌ ఈఎంఐతో కొనుగోళ్లు చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే..!

ప్రాజెక్ట్‌ కైపర్‌లో భాగంగా మొత్తం 3236 శాటిలైట్లను అమెజాన్‌ అంతరిక్షంలోకి పంపనుంది. 2026నాటికి సగానికిపై ఉపగ్రహాలను పంపించాలన్నది ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఉపగ్రహాల ద్వారా తక్కువ ధరలోనే 1 జీబీపీఎస్‌ వేగంతో ఇంటర్నెట్‌ సేవలను అందించే అవకాశం ఉంది. అమెజాన్‌ ఇ-కామర్స్‌తో పాటు ప్రైమ్‌ వీడియో సేవలను విస్తరించేందుకూ ఇది దోహదపడనుంది. అయితే, శాటిలైట్ ఇంటర్నెట్‌ సేవలకు ఎంత చెల్లించాల్సి ఉంటుంది? ఎప్పుడు అందుబాటులోకి వచ్చేదీ వంటి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే సునీల్‌ మిత్తల్‌కు చెందిన వన్‌వెబ్‌, ముకేశ్‌ అంబానీకి చెందిన జియో శాటిలైట్‌ సేవల కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాయి. ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌ లింక్‌కు ఇంకా అనుమతులు లభించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని