SIP: సిప్‌ మిస్‌ అయ్యారా.. ఈ ప్రయోజనాలు కోల్పోతారు

SIP: అనుకోని పరిస్థితుల కారణంగా సిప్‌ను మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే అలాంటి పరిస్థితులు ఎదురైతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసుకోండి..

Updated : 15 Jul 2023 10:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పెద్ద మొత్తంలో నగదు సమకూర్చుకోవడానికి ఉన్న మార్గాల్లో క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) ఒకటి. మ్యూచువల్ ఫండ్‌ (Mutual Funds) సిప్‌లో క్రమశిక్షణతో చేసే పెట్టుబడులు దీర్ఘకాలంలో మొరుగైన లాభాలను తెచ్చిపెడతాయి. కాంపౌండింగ్‌ ప్రతిఫలమే ఇందుకు కారణం. దీనికోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా స్థిరమైన మొత్తంలో డబ్బులు పెట్టాలి. ఒక వేళ ఏదైనా కారణంతో ఆ నెల సిప్‌ చెల్లించడం మరిచిపోతే మీ ప్రతిఫలంపై ప్రభావం పడుతుంది. అందుకే ఒక నెల కూడా మిస్‌ చేయకుండా సిప్‌ మొత్తాన్ని అకౌంట్‌లో ఉంచటం మేలైన పని. కొన్నిసార్లు అనుకోని పరిస్థితుల వల్ల సిప్‌ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఇప్పుడు చూద్దాం..

  • ఏదైనా కారణంగా మీరు చెల్లించాల్సిన సిప్‌ మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ ఖాతాలో జమచేయకపోతే మీరు కోరుకున్న సమయంలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కోల్పోతారు. మీరు సిప్‌ మిస్‌ చేసిన సమయంలో మార్కెట్‌ అనుకూలంగా ఉంటూ మంచి లాభాలు ఇస్తుంటే ఆ లాభాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
  • సిప్‌ అనేది మీకు ఆర్థిక భరోసానిచ్చే ఓ మంచి అలవాటు. క్రమం తప్పకుండా చెల్లిస్తే ఆశించిన మేరకు ఫలితాన్ని పొందొచ్చు. మధ్యలో కొన్ని వాయిదాలను దాటవేస్తే వచ్చే రాబడిలో వ్యత్యాసం గణనీయంగా ఉంటుంది. దీంతో మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడంలో అవాంతరం ఏర్పడుతుంది.
  • సిప్‌లో చెల్లించాల్సినంత డబ్బు మీ ఖాతాలోలేని సమయంలో మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు మీ అకౌంట్‌ నుంచి డబ్బులు తీసుకోలేవు. అటువంటి సమయంలో ఆ నెల సిప్‌ రద్దయ్యే అవకాశమూ ఉంటుంది. 
  • చెల్లింపులను మిస్ చేశామంటే మీ మ్యూచువల్ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోపై ప్రభావం పడుతుంది. అందులోని యూనిట్ల సంఖ్య తగ్గిపోతుంది. క్రమంగా ఇది మీరు పెట్టుబడిన చేసిన మొత్తంపై ప్రభావం పడుతుంది.
  • సిప్‌ పేమెంట్లు ఆలస్యంగా లేదా పూర్తిగా చెల్లించని సమయంలో కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు పెనాల్టీ విధిస్తాయి. అదనంగా సొమ్ము తీసుకుంటాయి. అందుకని మీరు ఏ సంస్థకు చెందిన మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేయాలనుకుంటున్నారో వాటి నియమనిబంధనలు తప్పకుండా చదవాలి. 
  • క్రమంగా సిప్‌లో పెట్టుబడులు చేయటం క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానం. ఈ దీర్ఘకాల పెట్టుబడి విధానం ద్వారా మీరు కోరుకున్న ఆర్థిక లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటారు. స్థిరత్వం, క్రమశిక్షణ అనేవి దీర్ఘకాల సంపదను తెచ్చిపెట్టడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అందుకనే ఎగవేత లేకుండా సిప్‌ చేయడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తారు. మీ వద్ద సిప్‌లో పెట్టాల్సిన సొమ్ము లేనప్పుడు సంబంధిత మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థతో మాట్లాడితే వారు ఇతర పరిష్కార మార్గాలను సూచించే అవకాశం ఉంటుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు