Axis- Flipkart: యాక్సిస్- ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో క్రెడిట్ కార్డ్.. ఫీచర్లివే!
Axis- Flipkart New credit card: ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఫ్లిప్‌కార్టులో షాపింగ్ చేసినా, ఫ్లిప్‌కార్టు వెలుపల షాపింగ్ చేసినా సూపర్ కాయిన్లు లభిస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశీయ మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన యాక్సిస్ బ్యాంక్ (Axis bank).. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) భాగస్వామ్యంతో ‘సూపర్ ఎలైట్’ పేరుతో మరో కొత్త క్రెడిట్‌కార్డును లాంచ్ చేసింది. ఫ్లిప్‌కార్ట్ సూపర్‌కాయిన్స్ రివార్డ్ ప్రోగ్రామ్‌ను మెరుగుపరచడంతో పాటు, కస్టమర్లకు మంచి షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని తన ప్రకటనలో పేర్కొంది. ఈ రెండు సంస్థలు ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్-యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును అందిస్తున్నాయి. ఇటీవల ఈ కార్డు మూడు మిలియన్ల (30 లక్షలు) మైలురాయిని చేరుకున్న సందర్భంలో కస్టమర్లకు ప్రత్యేకమైన రివార్డులను అందించేందుకు మరో కార్డును తీసుకొచ్చినట్లు ఇరు సంస్థలు పేర్కొన్నాయి.
వెల్‌కమ్ బెన్‌ఫిట్స్..
- కార్డు యాక్టివేషన్‌పై 500 సూపర్ కాయిన్స్
- 2 నెలల యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ మెంబర్‌షిప్
- 3 నెలల గానా (Gana) ట్రయల్ సబ్‌ష్క్రిప్షన్
- ఏడాది లెన్స్‌కార్ట్ గోల్డ్ సభ్యత్వం
- మింత్రాలో ఎంచుకున్న స్టైల్స్‌పై అదనంగా రూ.500 తగ్గింపు (*రూ.2999 మించి చేసే కొనుగోళ్లపై, గరిష్ఠంగా మూడు లావాదేవీలకు)
- ఫ్లిప్‌కార్ట్ ద్వారా బుక్ చేసుకునే దేశీయ ఫ్లైట్ బుకింగులపై 15% రాయితీ (*గరిష్ఠ రాయితీ రూ.1500)
ప్రత్యేక ప్రయోజనాలు..
ఫ్లిప్‌కార్ట్-యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేసినా, ఫ్లిప్‌కార్ట్ వెలుపల షాపింగ్ చేసినా సూపర్ కాయిన్లు లభిస్తాయి. వినియోగదారుడు సంపాదించిన కాయిన్లు ఫ్లిప్‌కార్ట్ యాప్ సూపర్‌కాయిన్ బ్యాలెన్స్‌లో జమవుతాయి. వీటితో ఫ్లిప్‌కార్ట్ యాప్ ఉపయోగించుకుని కొనుగోలు చేసే వస్తువులపై తగ్గింపు, ఇతర ప్రయోజనాలను పొందొచ్చు.
రివార్డులు ఇలా..
- ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లు ప్రతి రూ.100 ఖర్చుపై 16 సూపర్ కాయిన్‌లను ఈ కార్డు ద్వారా పొందొచ్చు. అయితే ఒక లావాదేవీలో గరిష్ఠంగా 300 కాయిన్లను మాత్రమే పొందే వీలుంది. ప్రస్తుత కార్డుపై ఫ్లిప్‌కార్ట్ 4 సూపర్ కాయిన్లు (ఒక లావాదేవీలకి గరిష్ఠంగా 100 కాయిన్ల) అందిస్తోంది.
- ఇక సాధారణ ఫ్లిప్‌కార్ట్ కస్టమర్లు ప్రతి రూ.100 ఖర్చుపై 8 సూపర్ కాయిన్లను పొందొచ్చు. ఒక లావాదేవీపై గరిష్ఠంగా 150 కాయిన్లను మాత్రమే పొందే వీలుంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ 2 సూపర్ కాయిన్లు (ఒక లావాదేవీలకి గరిష్ఠంగా 50 కాయిన్ల) ఇస్తోంది.
-
వినియోగదారులు ఈ కార్డును ఉపయోగించి ఇతర చోట్ల చేసే అర్హత గల ప్రతి రూ.100 ఖర్చుపై 2 సూపర్ కాయిన్లను పొందొచ్చు. దీనికి గరిష్ఠ పరిమితి లేదు.
జాయినింగ్/వార్షిక రుసుములు..
ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ సూపర్ ఎలైట్ క్రెడిట్ కార్డుపై రూ.500 జాయినింగ్ ఫీజు ఉంటుంది. రెండో సంవత్సరం నుంచి రూ.500 వార్షిక రుసుము ఉంటుంది. అయితే, కార్డును ఉపయోగించి వార్షికంగా రూ.2 లక్షలపైగా ఖర్చు చేసిన వారికి వార్షిక రుసుము రద్దు చేస్తారు. అలాగే క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యపు చెల్లింపు ఛార్జీలు, క్యాష్ విత్‌డ్రా ఛార్జీలు, ఫైనాన్స్ ఛార్జీలు వంటి ఛార్జీలు ఉంటాయి. కార్డును తీసుకునేటప్పుడు ఈ ఛార్జీలను కూడా పరిశీలించడం మంచిది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ICC Rankings: టాప్‌లోకి రషీద్ ఖాన్ .. మెరుగైన రోహిత్, హార్దిక్ ర్యాంకులు
-
General News
Viveka Murder case: ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్న ఎంపీ అవినాష్‌రెడ్డి
-
Movies News
Dasara: ‘బాహుబలి’.. ‘ఆర్ఆర్ఆర్’.. ఇప్పుడు ‘దసరా’!
-
India News
PM Modi: భారత ఆర్థికాభివృద్ధి.. ప్రజాస్వామ్య ఘనతే: ప్రధాని మోదీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Rohit Sharma: ఐపీఎల్లో రోహిత్‌కు విశ్రాంతి.. ముంబయి కోచ్ ఏమన్నాడంటే?