Paytm: పేటీఎం నుంచి బెర్క్‌షైర్‌ హాత్‌వే బయటకు

పేటీఎం నుంచి వారెన్‌ బఫెట్‌కు చెందిన బర్క్‌షైర్‌ హాత్‌వే పూర్తిగా బయటకు వచ్చింది. తనకున్న మొత్తం వాటాను శుక్రవారం ఆ కంపెనీ బల్క్‌డీల్‌ ద్వారా విక్రయించింది.

Published : 24 Nov 2023 21:17 IST

ముంబయి: ప్రముఖ ఫిన్‌టెక్‌ పేటీఎం మాతృ సంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ నుంచి వారెన్‌ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే తన పూర్తి వాటాను విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌లో ఒక్క షేరును రూ.877.20 చొప్పున మొత్తం 1.56 కోట్ల షేర్లను రూ.1371 కోట్లకు విక్రయించింది. బెర్క్‌షైర్‌ హాత్‌వేకు చెందిన బీహెచ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ ఈ షేర్లను విక్రయించగా.. విదేశీ సంస్థాగత మదుపరులైన పెట్టుబడిదారులు కాప్తాల్ మారిషస్ ఇన్వెస్ట్‌మెంట్ (1.19 శాతం), ఘిసాల్లో మాస్టర్ ఫండ్ (0.67 శాతం) కొనుగోలు చేశాయి. ఇతర కొనుగోలుదారుల వివరాలు తెలియరాలేదు. ఎక్స్ఛేంజీల వద్ద ఉన్న సమాచారం ప్రకారం పేటీఎంలో సెప్టెంబర్‌ చివరికి నాటికి బెర్క్‌షైర్‌కు 2.46 శాతం వాటా ఉండేది. శుక్రవారం మార్కెట్‌ ముగిసే సమయానికి వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు 3.08 శాతం నష్టంతో రూ.895 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని