Elon Musk: నాకు శస్ర్త చికిత్స జరిగే అవకాశం ఉంది: ఎలాన్‌ మస్క్‌

సుమో రెజ్లర్‌తో ఫైటింగ్‌ తర్వాత తనకు మెడ పైభాగంలో గాయమైనట్లు మస్క్‌ వెల్లడించారు. దీంతో తనకు శస్ర్త చికిత్స జరిగే అవకాశం ఉంటుందని అన్నారు. 

Published : 07 Aug 2023 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: త్వరలో తనకు శస్ర్త చికిత్స చేసే అవకాశం ఉంటుందని స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సోమవారం ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా తెలియజేశారు. మస్క్‌, మార్క్‌ జుకర్‌బర్గ్‌ (Mark Zuckerberg)మధ్య కేజ్‌ ఫైట్‌  (cage fight)జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు. కానీ, అది ఎప్పుడనేది తెలియాల్సి ఉంది.

ఈ పోరు కోసం ఇద్దరూ సన్నద్ధమౌతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా సుమో రెజ్లర్‌తో జరిగిన ఫైటింగ్‌ తర్వాత తనకు మెడ పైభాగంలో గాయమైనట్లు మస్క్‌ వెల్లడించారు. అది తనకు ఎంతో బాధ కలిగిస్తోందని తెలిపారు. గతంలోనూ ప్రాక్టీస్‌ సమయంలో వెన్ను భాగంలో గాయం అయినట్లు తెలిపారు. దీంతో ఆయన ఎమ్‌ఆర్‌ఐ(MRI)పరీక్ష చేయించుకున్నట్లు వెల్లడించారు. రేపు ఫలితాలు వచ్చాక సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే, కేజ్‌ ఫైట్‌కు ముందే సర్జరీ అవసరమా కాదా అనే విషయం ఈ వారంలో తెలుస్తుందని మస్క్‌ పేర్కొన్నారు. ఈ పోస్టుతో మస్క్‌ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.

కేజ్ ఫైట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌.. మస్క్‌ ట్వీట్‌కు జుకర్‌ కౌంటర్‌

ఇదిలా ఉండగా.. కొన్ని రోజులుగా టెక్‌ దిగ్గజాల మధ్య మాటల పోరు జరుగుతోంది. తమ మధ్య జరిగే కేజ్‌ ఫైట్‌ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో ప్రత్యక్ష ప్రసారమవుతుందని మస్క్‌ తెలిపారు. దీనికి స్పందించిన జుకర్‌ ఆయనకు గట్టి కౌంటర్‌ ఇచ్చారు.  లైవ్‌ స్ట్రీమింగ్‌కు ఇంతకంటే మంచి వేదిక లేదా? అంటూ ఎద్దేవా చేశారు. ఈ రోజు ఫైట్‌ చేయడానికైనా తాను సిద్ధమే అంటూ జుకర్‌ సవాల్‌ విసిరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని