గూగుల్‌ పిక్సెల్‌ 7 ధర రూ.59,999

గూగుల్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ అయిన పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో ధరలు ఇతర దేశాలతో పోలిస్తే మనదగ్గర 15-21 శాతం అధికంగా ఉన్నాయి. శుక్రవారం కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పిక్సెల్‌ 7 ధర రూ.59,999 కాగా, పిక్సెల్‌ 7 ప్రో ధర రూ.84,999. ఫ్లిప్‌కార్ట్‌లో వీటికి ప్రీ-బుకింగ్‌ చేసుకోవచ్చు.

Published : 08 Oct 2022 02:27 IST

పిక్సెల్‌ 7 ప్రో.. రూ.84,999

ఇతర దేశాలతో పోలిస్తే అధికం

దిల్లీ: గూగుల్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ అయిన పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రో ధరలు ఇతర దేశాలతో పోలిస్తే మనదగ్గర 15-21 శాతం అధికంగా ఉన్నాయి. శుక్రవారం కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. పిక్సెల్‌ 7 ధర రూ.59,999 కాగా, పిక్సెల్‌ 7 ప్రో ధర రూ.84,999. ఫ్లిప్‌కార్ట్‌లో వీటికి ప్రీ-బుకింగ్‌ చేసుకోవచ్చు. ‘గూగుల్‌ తదుపరి తరం టెన్సార్‌ జి2 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 13తో వస్తున్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఈనెల 13 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటాయ’ని సంస్థ తెలిపింది. అంతర్జాతీయంగా ఈ రెండు ఫోన్ల ధరలు 599 డాలర్లు; 899 డాలర్లు. రూపాయల్లో చూస్తే రూ.49,000; రూ.74,000 మాత్రమే. కానీ భారత్‌లో ధరలు అంత కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ ఎక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తున్నారని అడగ్గా.. ‘పలు అంశాల ఆధారంగా స్థానిక ధరలను నిర్ణయిస్తాం. అందులో స్థానిక పన్నులు, కస్టమ్స్‌ సుంకాలు, హార్డ్‌వేర్‌, ఏఐ సాఫ్ట్‌వేర్‌ వంటివి ఉంటాయ’ని గూగుల్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. గూగుల్‌ తన మొబైల్‌ ఫోన్‌ తయారీ ప్రాంతాన్ని  వెల్లడించలేదు. స్పీచ్‌ రికగ్నిషన్‌తో వస్తున్న ఈ ఫోన్లతో ఆడియో మెసేజ్‌లను చదువుకునే సౌలభ్యం ఉంది. బ్యాటరీ ఛార్జింగ్‌ రోజంతా ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని