Credit Card: విదేశాల్లో క్రెడిట్ కార్డు చెల్లింపులు ఫెమా కిందకు ఎందుకంటే..
డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపులపై పన్ను విధానంలో సమానత్వం తెచ్చేందుకే విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులకు సంబంధించి ఫెమా (విదేశీ మారకపు ద్రవ్య నియంత్రణ) నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆర్థిక శాఖ గురువారం తెలిపింది.
ఆర్థిక శాఖ వివరణ
దిల్లీ: డెబిట్, క్రెడిట్ కార్డుల చెల్లింపులపై పన్ను విధానంలో సమానత్వం తెచ్చేందుకే విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులకు సంబంధించి ఫెమా (విదేశీ మారకపు ద్రవ్య నియంత్రణ) నిబంధనల్లో మార్పులు చేసినట్లు ఆర్థిక శాఖ గురువారం తెలిపింది. ఆర్‌బీఐకి చెందిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్(ఎల్‌ఆర్‌ఎస్) కిందకు విదేశాల్లో చేసే క్రెడిట్ కార్డు చెల్లింపులను తీసుకొచ్చినందున.. అటువంటి చెల్లింపులపై మూలం వద్ద పన్ను వసూలు(టీసీఎస్) కింద వర్తించే రేట్లను చెల్లించాల్సి వస్తుంది. ఒక వేళ టీసీఎస్ చెల్లింపుదారు పన్నుచెల్లింపుదారైతే.. వారు క్రెడిట్‌ను తమ ఆదాయపు పన్ను లేదా ముందస్తు పన్నులకు సర్దుబాటు చేసుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ 2023-24లో విదేశీ పర్యాటక ప్యాకేజీలు, ఎల్‌ఆర్‌ఎస్ కింద నిధుల చెల్లింపుల (విద్య, వైద్య చెల్లింపులు కాకుండా..)పై టీసీఎస్ రేట్లను 5 శాతం నుంచి 20 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. కొత్త టీసీఎస్ రేట్లు ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వస్తాయి. కొంత మంది వ్యక్తులు ఎల్‌ఆర్‌ఎస్ కింద చేసే వ్యయాలు వారి ఆదాయ వనరులతో పోలిస్తే ఎంతో ఎక్కువగా ఉన్నట్లు పన్ను అధికారుల దృష్టికి రావడంతోనే, తాజా మార్పులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం.
కంపెనీయే భరిస్తే.. ఎల్‌ఆర్‌ఎస్ కిందకు రాదు: వ్యాపార పర్యటనకు వెళ్లే ఒక ఉద్యోగి చేసే ఖర్చులను సదరు కంపెనీయే భరిస్తే, అటువంటి వ్యయాలు ఎల్‌ఆర్‌ఎస్ కిందకు రావని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఎల్‌ఆర్‌ఎస్ కింద ఒక వ్యక్తి ఏటా 2.5 లక్షల డాలర్లను విదేశాల్లో ఖర్చుపెట్టడానికి అనుమతి ఉంది. అంతకుపైన వ్యయాలకు ఆర్‌బీఐ ఆమోదం అవసరం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
వీసాల్లో మార్పులు.. అండర్ గ్రాడ్యుయేట్లకు కాదు: యూకే మంత్రి
-
World News
Erdogan: జైలు నుంచి అధ్యక్షపీఠం వరకు.. ఎర్డోగాన్ రాజకీయ ప్రస్థానం..!
-
Politics News
AAP-Congress: ఆర్డినెన్స్‌పై పోరు.. ఆమ్ఆద్మీకి కాంగ్రెస్ మద్దతిచ్చేనా?
-
India News
అవినీతి ఆరోపణలు.. రోల్స్‌రాయిస్‌పై సీబీఐ కేసు
-
India News
హరివంశ్ నారాయణ్.. భావితరాలకు మీరు చెప్పేది ఇదేనా?: జేడీయూ
-
Sports News
IPL 2023: శుభ్‌మన్ గిల్ విషయంలో కోల్‌కతా ఘోర తప్పిదమదే: స్కాట్ స్టైరిస్