Reliance: ఇ-కామర్స్‌లో రిలయన్స్‌కు తిరుగుండదు!
అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ దేశీయ ఇ-కామర్స్ విపణిలో మెరుగైన స్థానంలో ఉన్నట్లు బెర్న్‌స్టీన్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. 150 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12.30 లక్షల కోట్లు) దేశీయ ఇ-కామర్స్ విపణిలో అమెజాన్, వాల్‌మార్ట్‌ల కంటే రిలయన్స్ ముందుందని పేర్కొంది.
బెర్న్‌స్టీన్ రీసెర్చ్ నివేదిక
దిల్లీ: అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ దేశీయ ఇ-కామర్స్ విపణిలో మెరుగైన స్థానంలో ఉన్నట్లు బెర్న్‌స్టీన్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. 150 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12.30 లక్షల కోట్లు) దేశీయ ఇ-కామర్స్ విపణిలో అమెజాన్, వాల్‌మార్ట్‌ల కంటే రిలయన్స్ ముందుందని పేర్కొంది. అతి పెద్ద రిటైల్ విక్రయశాలల నెట్‌వర్క్, ఆధిపత్య టెలికాం కార్యకలాపాలు, బలమైన డిజిటల్ మీడియా వంటివి రిలయన్స్‌ను ముందుండి నడిపిస్తాయని తెలిపింది. దేశంలో అమెజాన్, వాల్‌మార్ట్, రిలయన్స్‌ల మధ్యే ముక్కోణపు పోటీ ఉంటుందని వివరించింది. సంప్రదాయ రిటైల్ వ్యాపార నమూనా ఆఫ్‌లైన్ (వాల్‌మార్ట్) లేదా ఆన్‌లైన్ (అమెజాన్) నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించింది. ‘భారత్‌లో ఇ-కామర్స్ విపణి ఇందుకు భిన్నంగా ఉంటుంది. పంపిణీ సవాళ్లు, చాలా సాంకేతికతలు దాటడం కీలకమైన అంశం. ఒక సమగ్ర నమూనా (ఇంటిగ్రేటెడ్ మోడల్: ఆఫ్‌లైన్+ఆన్‌లైన్+ప్రైమ్), బలమైన పంపిణీ సామర్థ్యం, అధిక ధర ప్రయోజనం (ఆన్‌లైన్ సంస్థలకు పోటీగా) ప్రారంభం నుంచే అవసరమవుతాయ’ని నివేదిక వివరించింది.
* రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశీయంగా అతి పెద్ద డిజిటల్ పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది. దీని అనుబంధ సంస్థ జియోకు 43 కోట్ల మంది మొబైల్ చందాదార్లు ఉన్నారు. రిటైల్ అనుబంధ సంస్థకు దేశీయంగా 18,300 రిటైల్ విక్రయశాలలున్నాయి. వీటిల్లో 30 బి.డాలర్ల (సుమారు రూ.2.46 లక్షల కోట్ల) విక్రయాలు జరుగుతున్నాయి. డిజిటల్ మిక్స్ 17-18 శాతానికి (6 బి.డాలర్లు, ఇ-కామర్స్) పెరుగుతోంది. సమగ్ర ఆఫ్‌లైన్+ఆన్‌లైన్+ప్రైమ్ స్ట్రీమ్‌లోకి రిలయన్స్ ప్రవేశిస్తే అమెజాన్/వాల్‌మార్ట్‌లకు రిలయన్స్ గట్టి పోటీ ఇస్తుందని బెర్న్‌స్టీన్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
* భారతీయ ఇ-కామర్స్ విపణి 2025 నాటికి 150 బి.డాలర్లకు చేరుతుందని అంచనా. ఫ్లిప్‌కార్ట్ 23 బి.డాలర్ల జీఎంవీ, అమెజాన్ 18-20 బి.డాలర్ల జీఎంవీతో మొదటి రెండు స్థానాల్లో ప్రస్తుతం కొనసాగుతుండగా, రిలయన్స్ 5.7 బి.డాలర్ల జీఎంవీతో మూడో స్థానంలో ఉంది. ఫ్యాషన్ (అజియో), ఇ-గ్రోసరీ (జియోమార్ట్) ఇందుకు సహకరిస్తున్నాయి. ఈ 3 సంస్థలు గెట్ బిగ్ (విస్తరణ), గెట్ క్లోజ్ (ఖాతాదారు నమ్మకం), గెట్ ఫిట్ (లాభదాయకత)పై ప్రధానంగా దృష్టి సారించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
-
Bandaru: గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు మాజీ మంత్రి బండారు