Amazon: జలమార్గంలో అమెజాన్‌ సరకు రవాణా

గంగా నది ద్వారా జల మార్గాల్లో సరకు రవాణాను ప్రోత్సహించేందుకు అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇ-కామర్స్‌ సరకుతో తొలి నౌక పాట్నా నుంచి కోల్‌కతాకు త్వరలోనే బయలుదేరుతుందని ఓడరేవులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్‌ తెలిపారు.

Updated : 23 Nov 2023 07:46 IST

దిల్లీ: గంగా నది ద్వారా జల మార్గాల్లో సరకు రవాణాను ప్రోత్సహించేందుకు అమెజాన్‌ సెల్లర్‌ సర్వీసెస్‌, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇ-కామర్స్‌ సరకుతో తొలి నౌక పాట్నా నుంచి కోల్‌కతాకు త్వరలోనే బయలుదేరుతుందని ఓడరేవులు, షిప్పింగ్‌, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్‌ తెలిపారు. జల రవాణా సామర్థ్యం పెంపు, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడం, ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఊతమివ్వడం ఈ భాగస్వామ్యం వెనక ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. జల రవాణాతో పోలిస్తే రైల్వే, రోడ్డు రవాణా కోసం ఇంధన వినియోగం 18.5%, 91.6% అధికంగా జరుగుతుంది. అందువల్ల జల రవాణా వల్ల పర్యావరణానికి ప్రయోజనం ఎక్కువగానే ఉంటుంది. దేశంలో జల రవాణాను పెంచేందుకు సాగర్‌మాల కింద మొత్తం 113 ప్రాజెక్టులను రూ.7,030 కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో     రూ.1,100 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో రూ.3,900 కోట్ల విలువైన 32 ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. 2030 కల్లా అంతర్గత జలమార్గ రవాణా పరిమాణాన్ని 200 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచాలన్నది మంత్రిత్వ శాఖ ఉద్దేశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని