Paytm: పేటీఎంలో 50,000కు పైగా ఉద్యోగాలు!

ఆన్‌లైన్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను పునరుద్ధరించాలని అనుకుంటున్నట్లు పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ వెల్లడించారు.

Updated : 21 Dec 2023 07:24 IST

సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ

దిల్లీ: ఆన్‌లైన్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను పునరుద్ధరించాలని అనుకుంటున్నట్లు పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ వెల్లడించారు. 50,000 మందికి పైగా సేల్స్‌ ఉద్యోగులను చేర్చుకోవడం ద్వారా, మరింత మంది మర్చంట్లను తమ నెట్‌వర్క్‌లో జత చేసుకుంటామని తెలిపారు. తద్వారా అనుకున్న సమయం కంటే ముందే కంపెనీని లాభాల్లోకి తీసుకొస్తామని వివరించారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉన్న యువ వినియోగదార్ల కోసం మనీ మేనేజ్‌మెంట్‌ పథకాలను పేటీఎం సవరిస్తోందని తెలిపారు. చిన్న నగరాలు, పట్టణాల్లో ఎక్కువ మంది వ్యాపారులను తమ వేదికపైకి తీసుకొచ్చేందుకు 60 శాతానికి పైగా సేల్స్‌ఫోర్స్‌ను ప్రచారానికి వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలతో పేటీఎం వ్యాపార రూపు మారుతుందని పేర్కొన్నారు. కాగా 2021లో ఐపీఓకు వచ్చిన తర్వాత పేటీఎం మార్కెట్‌ విలువ సుమారు 70 శాతం వరకు పడిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని