కోటి కుటుంబాల్లో సూర్యోదయం!

ప్రధానమంత్రి సూర్యోదయ యోజన... కోటి కుటుంబాల్లో వెలుగులు నింపనుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ పథకంలో భాగంగా కోటి ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు.

Updated : 02 Feb 2024 05:45 IST

ప్రధానమంత్రి సూర్యోదయ యోజన... కోటి కుటుంబాల్లో వెలుగులు నింపనుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఈ పథకంలో భాగంగా కోటి ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తారు. ఫలితంగా ఒక్కో కుటుంబం నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా పొందేందుకు, ఏడాదికి రూ.15,000 నుంచి రూ.18,000 దాకా ఆదా చేసుకునేందుకు, మిగులు విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించేందుకు వీలు కలుగుతుంది. తాత్కాలిక బడ్జెట్‌లో సౌర విద్యుత్‌ రంగానికి రూ.7,327 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో కేటాయించిన రూ.4,979 కోట్ల కంటే దాదాపు 48 శాతం ఎక్కువ. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా ‘రూఫ్‌ టాప్‌ సోలార్‌’ పథకం వల్ల కలిగే ప్రయోజనాల్ని కేంద్రమంత్రి సభకు వివరించారు. ఈ పథకం విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌కూ ఉపకరిస్తుందని, ఉపకరణాల తయారీ, నైపుణ్యాల పరంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు.  అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రూఫ్‌ టాప్‌ సోలార్‌’ పథకానికి రూ.10,000 కోట్లు కేటాయించనున్నట్లు ఆర్థికశాఖ కార్యదర్శి టి.వి.సోమనాథన్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని