58నిమిషాల్లో ముగిసిన బడ్జెట్‌ ప్రసంగం

నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం 58 నిమిషాల పాటు సాగింది. ఆమె చేసిన ఆరు బడ్జెట్‌ ప్రసంగాల్లో ఇదే చిన్నది. అత్యధిక సమయం పాటు బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఆర్థికమంత్రిగా ఆమె ఇది వరకే రికార్డు సృష్టించారు.

Updated : 02 Feb 2024 05:43 IST

  • నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం 58 నిమిషాల పాటు సాగింది. ఆమె చేసిన ఆరు బడ్జెట్‌ ప్రసంగాల్లో ఇదే చిన్నది. అత్యధిక సమయం పాటు బడ్జెట్‌ ప్రసంగం చేసిన ఆర్థికమంత్రిగా ఆమె ఇది వరకే రికార్డు సృష్టించారు. 2020లో రెండు గంటల 40 నిమిషాల పాటు ఆమె మాట్లాడారు.
  • జులైలో తమ ప్రభుత్వమే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందని నిర్మల అన్నప్పుడు అధికార పార్టీ సభ్యులు ఏకకంఠంతో మద్దతు తెలిపారు. విపక్ష సభ్యులు దీనిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.
  • లోక్‌సభకు ప్రధాని మోదీ వచ్చే సమయంలో భారత్‌ మాతా కీ జై, జై శ్రీరామ్‌, జై సియా రామ్‌ నినాదాలతో సభ మార్మోగింది.
  • గతంలో తమిళ కవుల పద్యాలను ఎక్కువగా ఉటంకించే నిర్మల.. ఈ ప్రసంగంలో వాటిని ప్రస్తావించలేదు. ప్రధాని మోదీ పేరును కనీసం ఎనిమిది సార్లు వివిధ సందర్భాల్లో ఉచ్చరించారు.
  • లోక్‌సభ పబ్లిక్‌ గ్యాలరీల్లో సందర్శకులు పెద్దగా కనబడలేదు. కొందరు రాజ్యసభ సభ్యులు, నిర్మలా సీతారామన్‌ కుమార్తె వాంగ్మయీ పరకాల, మరికొందరు బంధువులు హాజరయ్యారు.
  • ఎఫ్‌డీఐకి ఫస్ట్‌ డెవలప్‌ ఇండియా అని, జీడీపీకి గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, పర్ఫార్మెన్స్‌ అని ఆర్థికమంత్రి కొత్త అర్థాన్నిచ్చారు.
  • బడ్జెట్‌ ప్రసంగం పూర్తయిన అనంతరం నిర్మలా సీతారామన్‌ వద్దకు ప్రధాని మోదీ వెళ్లి అభినందించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని