‘కంటెక్చువల్‌ డిస్కవరీ టెక్నాలజీ’కి భారత పేటెంట్‌

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కీపాయింట్‌ టెక్నాలజీస్‌ ఆవిష్కరించిన ‘కంటెక్చువల్‌ డిస్కవరీ టెక్నాలజీ’కి ఇండియా పేటెంట్‌ ఆఫీస్‌ (ఐపీఓ) పేటెంట్‌ మంజూరు చేసింది.

Published : 17 Apr 2024 01:38 IST

కీపాయింట్‌ టెక్నాలజీస్‌ ఘనత 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కీపాయింట్‌ టెక్నాలజీస్‌ ఆవిష్కరించిన ‘కంటెక్చువల్‌ డిస్కవరీ టెక్నాలజీ’కి ఇండియా పేటెంట్‌ ఆఫీస్‌ (ఐపీఓ) పేటెంట్‌ మంజూరు చేసింది. ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కంప్యూటర్‌ లేదా ఇతర ఇన్‌పుట్‌ డివైజెస్‌లో పదాలు టైప్‌ చేయటం మొదలు పెట్టగానే దానికి సంబంధించిన పదాలు కనిపిస్తాయి. వెంటనే టైప్‌ చేయదలచిన పదాన్ని ఎంచుకోవచ్చు. రికమెండేషన్‌ ఇంజిన్‌ను కంప్యూటర్‌, మొబైల్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ ఇన్‌పుట్‌ డివైజెస్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే, ఆటోమ్యాటిక్‌ కంటెక్చువల్‌ డిస్కవర్‌ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడానికి కృత్రిమ మేధ, మెషీన్‌ లెర్నింగ్‌ పరిజ్ఞానాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానానికి పేటెంట్‌ సంపాదించడం ద్వారా తమ ఆవిష్కరణలకు గుర్తింపు లభించినట్లు అవుతోందని కీపాయింట్‌ టెక్నాలజీస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ మనీష్‌ చాప్లా అన్నారు. తమకు ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్‌, కొరియా తదితర దేశాల నుంచి 39 పేటెంట్లు ఉన్నాయని తెలిపారు. టెక్ట్స్‌ ప్రెడిక్షన్‌, హ్యూమన్‌-టు-మొబైల్‌ ఇంటర్‌ఫేస్‌, హ్యూమన్‌ - కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌, ఇంటెంట్‌ డిస్కవరీ, గ్లైడ్‌ అండ్‌ గ్లైడ్‌ టెక్ట్స్‌ ప్రెడిక్షన్‌ టెక్నాలజీలకు పేటెంట్లు పొందినట్లు వివరించారు. కానీ ఇండియా పేటెంట్‌ ఆఫీసు నుంచి పేటెంట్‌ పొందడం తమకు ప్రత్యేక విషయమని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని