GMR Airports: WAISLలో వాటాను కొనుగోలు చేయనున్న జీఎంఆర్‌

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రా WAISLలో 8.40 శాతం వాటాను రూ.56.66 కోట్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 30 Apr 2024 19:02 IST

హైదరాబాద్‌: జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తన విమానాశ్రయ సంబంధిత వ్యాపారాలను మెరుగుపరచుకోవడానికి విమానాశ్రయాలలో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ WAISLలో 8.40 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఉత్తిష్ట విరాట్‌ ఫండ్‌ నుంచి 4,60,000 WAISL షేర్లను రూ.56.66 కోట్లకు కొనుగోలు చేయడానికి కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది.

జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రా.. GAL(GMR Airports Ltd) ద్వారా దిల్లీ, హైదరాబాద్‌, గోవా, ఫిలిప్పీన్స్‌లోని విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. జీఎంఆర్‌ కంపెనీ.. ఎయిర్‌పోర్ట్స్‌ వ్యాపారానికి సంబంధించిన అన్ని అంశాలలో తన ఉనికిని విస్తరించుకోవడంపై దృష్టి సారించింది. WAISL.. 2009 నుంచి విమానాశ్రయాలలో డిజిటల్‌ మౌలిక సదుపాయాలను అందించే వ్యాపారంలో ఉంది. ఇది విమానాశ్రయాల్లో ఐటీ సేవలు అందించే ప్రత్యేక భాగస్వామిగా పని చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని