Toll fee: మార్చికల్లా జీపీఎస్‌ టోల్‌ వ్యవస్థ: గడ్కరీ

జాతీయ రహదారులపై ఇకపై జీపీఎస్‌ ఆధారిత టోల్‌ వ్యవస్థ రానుంది. 2024 మార్చికల్లా ఈ వ్యవస్థను తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి గడ్కరీ వెల్లడించారు. 

Published : 20 Dec 2023 21:41 IST

Toll Collection | దిల్లీ: జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీల వసూలుకు జీపీఎస్‌ ఆధారిత వ్యవస్థను 2024 మార్చి నాటికి తీసుకురానున్నట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ  వెల్లడించారు. దీనివల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగడంతో పాటు జాతీయ రహదారిపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్‌ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. దేశవ్యాప్తంగా మార్చి నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. 

ఏంటీ టోల్‌ ట్యాక్స్‌.. ఎందుకు చెల్లించాలి!

ఈ విధానంలో భాగంగా టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అసరం లేకుండా ఆటోమేటిక్‌ నంబర్‌ప్లేట్‌ రీడర్లను ఏర్పాటు చేయనున్నట్లు గడ్కరీ చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే రెండు పైలట్‌ ప్రాజెక్టులు చేపట్టామని తెలిపారు. 2018-19లో టోల్‌ప్లాజాల వద్ద వేచి ఉండే సమయం సగటున 8 నిమిషాలుగా ఉండేదని, ఫాస్టాగ్‌ వచ్చిన తర్వాత 2020-21, 2021-22లో ఆ సమయం 47 సెకన్లకు తగ్గిందన్నారు. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేలోపు బిల్డ్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిన రూ.1.5 నుంచి రూ.2 లక్షల కోట్ల రోడ్లు ప్రాజెక్టులకు బిడ్లు ఆహ్వానించనున్నట్లు గడ్కరీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని