FD Rates: మరోసారి ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ నెలలో రెండోసారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్‌ 26 నుంచి అమల్లోకి వస్తాయి.

Published : 26 Oct 2022 15:44 IST

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ నెలలో రెండోసారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 50 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచింది. 7 రోజుల నుంచి 14 రోజుల కనిష్ఠ కాలవ్యవధి సాధారణ డిపాజిట్లకు 3% వడ్డీ లభిస్తుంది. ఒక సంవత్సరం కాలవ్యవధి ఎఫ్‌డీలకు 6.10% లభిస్తుంది. 5 ఏళ్ల ఎఫ్‌డీలకు గరిష్ఠంగా 6.25% వడ్డీ రేటును పొందుతారు. సీనియర్‌ సిటిజన్లు ఇదే కాల వ్యవధి డిపాజిట్లకు 0.50% వడ్డీని అదనంగా పొందుతారు. వీరు కనిష్ఠంగా 3.50% నుంచి గరిష్ఠంగా 6.75% వరకు వడ్డీ రేట్లను పొందుతారు. ఈ కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్‌ 26 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ రేట్లు రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లకు వర్తిస్తాయి.

ఈ బ్యాంక్‌ రికరింగ్‌ డిపాజిట్లు (RD)లపై సాధారణ డిపాజిటర్లకు 6 నెలల కాలవ్యవధికి 4.50% నుంచి 5 ఏళ్ల కాలవ్యవధికి 6.25% వరకు వడ్డీని అందిస్తుంది. ఇదే కాలవ్యవధులకు సీనియర్‌ డిపాజిటర్లు ఈ ఆర్‌డీలపై కూడా అదనంగా 0.5% వడ్డీ రేటును పొందుతారు. వీరికి కనిష్ఠంగా 5% నుంచి గరిష్ఠంగా 6.75% వరకు వడ్డీ రేటు లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని